రిస్ట్ వాచ్ తో గుర్తు పట్టాల్సొచ్చింది..ఛిద్రం: అత్యంత విషాదకరం!!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. భార్య సునేత్రా పవార్, కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తోన్న మరో అయిదుమంది కూడా మరణించారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం ఆ ఉదయం మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలింది.
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి..
ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మొదలుకుని వివిధ రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలియజేశారు. ఆయన మృతికి సూచికగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. అజిత్ పవార్ పార్థివ దేహానికి గురువారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

ప్రాథమిక నివేదికలో..
ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, వాతావరణ వివరాలు వంటివి పరిగణనలోకి తీసుకుని దీన్ని తయారు చేసింది. ప్రతికూల వాతావరణం, బారామతి ఎయిర్ స్ట్రిప్ లో మౌలిక సదుపాయాల కొరత, కార్యాచరణ పొరపాట్లు కలగలిసి ఈ దుర్ఘటనకు కారణం అయ్యాయి. పుణె-బారామతి ప్రాంతంపై దట్టమైన పొగమంచు ఆవరించడం వల్ల విజిబిలిటీ అత్యంత ప్రమాదకర స్థాయికి తగ్గింది. బారామతి ఎయిర్‌స్ట్రిప్‌లో ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) లేకపోవడం వల్ల ల్యాండింగ్ మాన్యువల్‌గా, విజువల్‌గా చేయాల్సి వచ్చింది.
తొలి ల్యాండింగ్ ప్రయత్నం విఫలం..
బారామతి స్ట్రిప్ టేబుల్ టాప్ రన్‌వే. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. తొలి ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైనట్లు డీజీసీఏ నిర్ధారించింది. తొలి ల్యాండింగ్ సమయంలో దాదాపుగా రన్ వే మీదికి వచ్చిన ఈ ఫ్లైట్ లో- విజిబిలిటీ కారణంగా మళ్లీ గాల్లోకి లేచింది. ఓ బిగ్ టర్న్ తీసుకుంది. రెండో ప్రయత్నంలో పరిస్థితి అదుపు తప్పింది. పైలట్ మే డే కాల్ సైతం ఇచ్చారు. సుమారు 100 అడుగుల ఎత్తులో విమానం సమతుల్యత కోల్పోయింది. రన్‌వేకు చేరకముందే నేలను ఢీకొట్టింది.
భూమిని తాకగానే పెద్ద ఎత్తున పేలుళ్లు..
ఈ తాకిడి వల్ల భారీ పేలుడు, తీవ్రమైన మంటలు చెలరేగాయి, సహాయక చర్యలు అసాధ్యం అయ్యాయి. దట్టమైన పొగమంచు, ILS లేకపోవడం, చిన్న టేబుల్-టాప్ రన్‌వే, మాన్యువల్ ల్యాండింగ్, తక్కువ ఎత్తు వంటి కీలక అంశాల కలయికే ఈ ప్రమాదానికి దారితీసిందని విశ్లేషిస్తున్నారు. విమానం భూమిని తాకగానే పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. అగ్నిప్రమాదం కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టడం సాధ్యం కాలేదు.
ఇలా గుర్తించారు..
అజిత్ పవార్‌ పార్థివ దేహాన్ని ఆయన చేతికి ఉన్న వాచీ, దుస్తుల ఆధారంగా గుర్తించారు. పేలుళ్లు, ఆ వెంటనే మంటలు చెలరేగడం వల్ల మృతదేహాలు దాదాపుగా ఛిద్రం అయ్యాయి. గుర్తు పట్టనంతగా మారాయి. విమాన శకలాల మధ్య నుంచి వాటిని వెలికి తీయాల్సి వచ్చింది. మిగిలిన మృతదేహాలను వారి వారి వస్తువుల ద్వారా గుర్తుపట్టారు. పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక అటెండెంట్, ఇద్దరు పైలట్‌లు ప్రయాణించారు. విమానంలోని ఐదుగురిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications