"మీ నమ్మకమైన ప్రభుత్వం": అజిత్ పవార్ చివరి పోస్ట్ వైరల్!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణవార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘోర ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే అజిత్ పవార్ సోషల్ మీడియా వేదికగా చేసిన చివరి పోస్ట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, కూటమిలో విభేదాల మధ్య కూడా ఆయన తన బాధ్యతలను ఏ విధంగా నిర్వహించారో ఆ పోస్ట్ ప్రతిబింబిస్తోంది.
"మీ నమ్మకమైన ప్రభుత్వం": అజిత్ పవార్ ఆఖరి సందేశం
బుధవారం ఉదయం బారామతిలో విమానం కుప్పకూలడానికి కొద్దిసేపటి ముందు అజిత్ పవార్ తన 'ఎక్స్' ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వివరిస్తూ.. "your trusted government" అనే ట్యాగ్‌లైన్‌తో ఆయన ఆ సందేశాన్ని పంచుకున్నారు.

ఆ పోస్ట్‌లో ఆయన పేర్కొన్న ప్రధాన అంశాలు:
వృత్తి విద్యా శిక్షణ సంస్థల ఏర్పాటు.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) కాంట్రాక్టర్ల చెల్లింపు విధానంలో మార్పులు.
ప్రభుత్వ భూముల లీజు కాలపరిమితి పొడిగింపు వంటి పరిపాలనాపరమైన నిర్ణయాలు.
పైకి ఇది సాధారణ ప్రభుత్వ సమాచారంగా కనిపించినా, ఆ సెకన్ల వెనుక మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠభరిత పరిణామాలు ఉన్నాయి.
आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :
— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026
✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…
కూటమిలో విభేదాలు.. అజిత్ పవార్ ఒంటరి పోరు
ముంబైతో పాటు పుణె, పింప్రి-చించ్వాడ్ వంటి 28 నగరాల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ మహాయుతి (బీజేపీ-శివసేన-ఎన్సీపీ) కూటమిలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి అజిత్ పవార్ వర్గానికి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. నవాబ్ మాలిక్ వంటి నేతలపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. దీంతో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో మళ్లీ చేతులు కలిపి, పుణె ప్రాంతంలో తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించారు. ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీపై విమర్శలు కూడా చేశారు. తనపై గతంలో ఉన్న రూ. 70,000 కోట్ల నీటిపారుదల స్కామ్ ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ బీజేపీ ధోరణిని ఎండగట్టారు.
తిరిగి విధుల్లోకి.. కానీ ఇంతలోనే!
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. అజిత్ పవార్ మళ్లీ ముంబైలోని తన డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరుకుని విధులు నిర్వహించడం ప్రారంభించారు. రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ, పాలనపై తన పట్టు సడలలేదని నిరూపించేలా ఆయన మంగళవారం అర్థరాత్రి వరకు పనిచేశారు. బుధవారం ఉదయం బారామతిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగి ఆయన కన్నుమూశారు. "నమ్మకమైన ప్రభుత్వం" గురించి ఆయన చేసిన ఆఖరి పోస్ట్, ఇప్పుడు ఆయన మద్దతుదారులకు కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications