మహా సంక్షోభం: ఉద్దవ్ థాకరేతో అజిత్ పవార్ భేటీ..
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో శివసేన ఆత్మరక్షణలో పడింది. ఎలాగైనా తమ దారిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇటు శివసేన ఎమ్మెల్యేలను సీఎం ఉద్దవ్ థాకరే నివాసం నుంచి ముంబైలోని ఓ హోటల్‌కు తరలించారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని.. అదీ శివసేన అంతర్గత విషయం అని ఎన్సీపీ స్పష్టంచేసింది.
మరోవైపు మంగళవారం సాయంత్రం సీఎం ఉద్దవ్ థాకరేతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమావేశం అయ్యారు. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. షిండే తిరుగుబాటుపై ఇద్దరూ చర్చించినట్టు తెలిసింది. ఇదివరకు అజిత్ పవార్ కూడా తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఫడ్నవీస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ అదీ మూణ్నాళ్ల ముచ్చగగానే మిగిలింది. ఇప్పుడు షిండే వంతు వచ్చింది.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగబాటు ఎగరవేశారు. 21 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్ వెళ్లారు. సూరత్‌లో గల మెరేడియన్ హోటల్‌లో బస చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అతనని సముదాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
22 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావించి ఉంటారు. శివసేనకు చెందిన 22 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలో ఈ పరిణామం జరిగింది. బీజేపీ పోటీ చేసిన 5 చోట్ల విజయం సాధించింది.












Click it and Unblock the Notifications