గతంలోనూ అదే విమానం క్రాష్: ఏం జరిగింది?

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైన అదే ప్రైవేట్ విమానం (Learjet 45, రిజిస్ట్రేషన్: VT-SSK), గతంలో 2023లో కూడా ఒకసారి ప్రమాదానికి గురైంది.

2023లో ఏం జరిగిందంటే?
సెప్టెంబర్ 2023లో ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఈ విమానం రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లి అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. పెను ప్రమాదం తప్పింది. అప్పట్లో విమానంలో ఉన్న ఎనిమిది మంది (6 ప్రయాణికులు, 2 సిబ్బంది) తీవ్రంగా గాయపడ్డారు, కానీ ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరమ్మతులు చేసి దానిని తిరిగి సర్వీసులోకి తీసుకొచ్చారు. అదే విమానంలో నేడు (జనవరి 28, 2026) అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి ప్రయాణించారు. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అదే విమానం అజిత్ పవార్ ప్రాణాలను బలితీసుకోవడం గమనార్హం.

ajit pawar plane crash Same Aircraft VT-SSK Had Crashed at Mumbai Airport in 2023 Full Details

నేటి ప్రమాద వివరాలు ఇలా..
బుధవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ విమానం బారామతి ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఓ భద్రతా అధికారి (PSO), ఒక అటెండెంట్, ఇద్దరు పైలట్లు మొత్తం ఐదుగురు మరణించినట్లు డీజీసీఏ (DGCA) ధ్రువీకరించింది. ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ అనే ప్రైవేట్ చార్టర్ సంస్థ నిర్వహిస్తోంది.

దర్యాప్తుకు ఆదేశం
గతంలోనే ప్రమాదానికి గురైన విమానాన్ని తిరిగి వాడటం, అందులోనూ కీలక నేత ప్రయాణించడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ లోపం ఉందా లేక వాతావరణం కారణమా అన్న కోణంలో డీజీసీఏ విచారణ ప్రారంభించింది. విమానంలో సాంకేతిక లోపం ఉందా?.. పాత ప్రమాదం తాలూకు ప్రభావం ఏమైనా ఉందా?.. విమానం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు?..ఈ అంశాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రానికి ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+