అజిత్ దోవల్ చైనా పర్యటన షురూ.. సరిహద్దు సమస్యపై కీలక చర్చలు..!

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 24 సోమవారం ఆయన బీజింగ్ లో అడుగుపెట్టనున్నారు. భారత్- చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరిగే భేటీలో ఆయన పాల్గొననున్నారు. చైనా భద్రతా సలహాదారు అయిన వాంగ్ యితో 25వ చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. భారత్- చైనా మధ్య సరిహద్దు చర్చలు 2003 లో తొలిసారిగా ప్రారంభం అయ్యాయి. ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ఘర్షణలు, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏటా ఈ చర్చలు జరుగుతుంటాయి. సరిహద్దు వివాదాలతోపాటు ఇతర అంశాలపైనా ఇరు దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.

ఇక సెప్టెంబర్ 12-13 తేదీల్లో దేశ రాజధాని దిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. భారత్ లో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ లో పర్యటనపై ఇంకా అధికారిక ధ్రువీకరణ జరగలేదు. ఒకవేళ జిన్ పింగ్ భారత్ లో పర్యటిస్తే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. దాంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు మరింత వేగంగా ముందుకు సాగుతాయి. ఇరు దేశాధినేతలు గతేడాది షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమ్మిట్, తియాంజిన్ లో చివరిసారిగా సమావేశం అయ్యారు.

AjitDoval visits China holds talks with Chinese representative Wang Yi the border issue AjitDoval

ఇక చైనా పర్యటన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. చైనా విషయంలో మరోసారి భారత వైఖరిని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం అత్యవసరమని పేర్కొన్నారు. ఇటీవల చైనా బలగాలు అరుణాచల్ ప్రదేశ్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఈశాన్య భారత్ లోని పలు రాష్ట్రాలపై చైనా తన పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా వాదనలు చేస్తూ వస్తోంది. అయితే చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ వస్తోంది. ఇక చైనా ఈ ప్రాంతాన్ని జాంగ్ వాన్ అని పిలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా స్వయంగా కొత్త పేర్లు పెడుతూ వివాదాలు సృష్టిస్తోంది. ఈ తరుణంలో చైనాలో అజిల్ దోవల్ పర్యాటన ప్రాధాన్యం సంతరించకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+