వైసీపీకి బిగ్ షాక్..! మాజీ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ..!
ఏపీలో విపక్ష వైఎస్సార్సీపీకి ఇవాళ మరో షాక్ తగిలింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కేబినెట్ మంత్రి ఒకరిని ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. గతంలో ఇదే మంత్రి కుమారుడిని అరెస్టు చేసిన ఈడీ.. ఆయన నుంచి లభించిన సమాచారం ఆధారంగా ఇవాళ ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. లిక్కర్ అక్రమ రవాణా విషయంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
వైసీపీ (ysrcp) హయాంలో మంత్రిగా వ్యవహరించిన పశ్చిమగోదావరి జిల్లా నేత కారుమూరి నాగేశ్వరరావును (Karumuri Nageswara rao) ఈడీ అధికారులు ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేశారు. లిక్కర్ స్కాంపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఇందులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మిగతా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ కారుమూరిని హైదరాబాద్ లోని కొండాపూర్ నివాసంలో ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

మద్యం రవాణా కోసం ఇచ్చిన టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ను ముందు పెట్టి వీరు అక్రమ దందా నడిపించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలోనే కారుమూరిని అరెస్టు తెలుస్తోంది. అయితే కారుమూరి అరెస్టుపై ఈడీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో వైసీపీ హయాంలో కీలక పదవుల్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి సహా పలువురు అధికారులు కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది. ఇవాళ విచారణ తర్వాత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవహారం ఏపీలో మరోసారి రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.














Click it and Unblock the Notifications