Viral Video: కుప్పకూలిన 22 అడుగుల గణేష్ విగ్రహం.. ఇద్దరు మృతి.. ఐదుగురికి సీరియస్
వినాయక చవితికి ఇంకా 20 రోజులే ఉంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి అంతా సిద్ధం అవుతున్నారు. నగరాలు, పల్లెల్లోని గల్లీ గల్లీల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే ముంబైలో విషాదకరమైన ఘటన జరిగింది. వినాయక చవితి నేపథ్యంలో భారీ వినాయక విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆ విగ్రహం కుప్పకూలింది. భారీ విగ్రహం ఒక్కసారిగా అక్కడున్న జనంపై పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి సంబరాలకు సిద్ధం అవుతున్నారు. ముంబైలో ఏటా గణేశ్ నవ రాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైలో గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో దక్షిణ ముంబై భూలేశ్వర్ లోని బలరామ్ మర్చంట్ రోడ్డులో ఏటా వినాయక చవితి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి కూడా దాదాపు 20 రోజుల ముందు నుంచే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పది గంటల సమయంలో 22 అడుగుల ఎత్తైన భూలేశ్వరచా రాజా వినాయక విగ్రహాన్ని స్థానిక మండపానికి వాహనంలో తరలించేందుకు సిద్దం అయ్యారు. డీజే పాటలతో వినాయకుడిని మండపానికి తీసుకొస్తున్నారు. అక్కడ జనం రద్దీతో కోలాహలంగా వాతావరణం ఉంది.
Bhuleshwar Ganpati Bappa, Mumbai
— D (@Deb_livnletliv) August 23, 2026
Two dead, five injured after a massive 22-foot Ganesh Idol of Bhuleshwar Cha Raja falls during its arrival procession.
Among the five injured, two are girls aged 5 and 7.
Seems welding of the frame holding idol wasn't done properly. pic.twitter.com/FBfcLAd0nU
అయితే క్రేన్ కు ఉన్న నట్లు కొన్ని లూజ్ గా ఉన్న కారణంగా విగ్రహం ఒక్కసారిగా ముందుకు పడిపోయింది. విగ్రహం ముందు నృత్యాలు చేస్తున్న భక్తులపై పడింది. దాంతో అక్కడున్న యువకుల మధ్య కాస్త తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, 108 అంబులెన్స్ సర్వీస్, మున్సిపల్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. మృతులు సంకేత్ నెవ్షే(33), బ్రిజేష్ హేమంత్ జోషి(30) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications