India-US Trade Deal: భారత్-యూఎస్ డీల్ పై గుడ్ న్యూస్..! అమెరికా కీలక ప్రకటన..!

భారత్-అమెరికా మధ్య దాదాపు ఏడాది కాలంగా నలుగుతూ వస్తున్న వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ ఒప్పందం కోసం గతంలో ఇరుదేశాలూ ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి వివిధ కారణాల వల్ల ముందుకు సాగలేదు. అప్పట్లో భారత్-అమెరికా మధ్య డీల్ కుదరకుండా పాకిస్తాన్ కూడా లాబీయింగ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో భారత్, పాక్ తో డీల్స్ విషయంలో ట్రంప్ అనుసరించిన నాన్చుడు ధోరణి కూడా ఇందుకు కారణమైంది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి.

భారత్ కు బంగ్లా మరో షాక్..! పాక్ కూటమిలోకి నాలుగో దేశంగా..!
భారత్ కు బంగ్లా మరో షాక్..! పాక్ కూటమిలోకి నాలుగో దేశంగా..!

దీంతో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) దాదాపుగా పూర్తయిందని భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాలూ ఈ ఒప్పందం పూర్తికి అవసరమైన చట్టపరమైన ముసాయిదాపై పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయం ప్రకటించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం సూత్రప్రాయంగా దాదాపు పూర్తయిందని సెర్గియో గోర్ అన్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు ఇరుపక్షాలు ఇప్పుడు చట్టపరమైన ముసాయిదాపై పనిచేస్తున్నాయని చెప్పారని వెల్లడించింది.

India-US Trade Deal Nears Finish Line as Legal Text Is Worked Out Sergio Gor
US-Iran War: ఇరాన్ అణ్వస్త్ర హెచ్చరిక..! ట్రంప్ దాడుల వేళ షాకింగ్..!
US-Iran War: ఇరాన్ అణ్వస్త్ర హెచ్చరిక..! ట్రంప్ దాడుల వేళ షాకింగ్..!

ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో జరుగుతున్న జాప్యానికి ఇంకా పరిష్కరించాల్సిన చట్టపరమైన, సాంకేతిక అంశాలే కారణమని సెర్గియో గోర్ వివరించారు. భారత్-అమెరికా సంబంధాలు ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆ ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ఆయన మరోసారి గుర్తుచేశారు. భారతదేశానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా, రెండు దేశాల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయి పరస్పర సంబంధాలను ఆయన ప్రస్తావించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇప్పటికే ఈ ఏడాది మేలో ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించారని, అక్టోబర్‌లో మరోసారి కొన్ని రోజుల పర్యటన కోసం రానున్నారని గోర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+