శశికళకు సినీ హీరో అజిత్ మార్గం వేశారా?
జయలలిత స్థానంలో శశికళ అన్నాడియంకె పగ్గాలు చేపట్టడానికి సినీ హీరో అజిత్ మార్గం సుగమం చేశాడా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పరిణామాలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తోంది.
చెన్నై: తన వారసుడిగా జయలలిత సినీ హీరో అజిత్‌ను ప్రకటించారనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో అన్నాడియంకె పరిస్థితి ఏమిటనే సందేహాలు తలెత్తుతూ వచ్చాయి. అదే సమయంలో చిన్నమ్మ శశికళ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా ఉదయించాయి. నిజానికి, అజిత్‌ను జయలలిత వారసుడిగా ప్రకటించినా, ప్రకటించకపోయినా ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటిస్తే పరిస్థితి మరో విధంగా ఉండేది.
శశికళ భవిష్యత్తు అగమ్యగోచరంగానే ఉండేది. కానీ అన్నాడియంకె ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టి పార్టీని నడిపించడానికి అజిత్ పరోక్షంగా సహకరించినట్లు కనిపిస్తున్నారు. ఆమె త్వరలో ముఖ్యమంత్రి పీఠం కూడా అధిష్టిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ స్థితిలో అజిత్ శశికళను కలిసి తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పినట్లు వచ్చిన వార్తలు మొత్తం పరిస్థితిని మార్చేశాయి.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి స్టార్ హీరో అజిత్ కూడా వార్తల్లో నిలిచాడు. జయలలిత వారసుడు అజిత్ అనే ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూు జజయలలిత మృతి వార్త విన్న వెంటనే అజిత్ ఆగమేఘాల మీద బల్గేరియా నుంచి వచ్చి అంజలి ఘటించి వెళ్లిపోయారు.

కాగా, తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడే జయలలిత అజిత్‌ను పలిచారని, తన రాజకీయ వారసత్వం స్వీకరించాలని ఆమె అజిత్‌ను కోరిందని, దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడని తమిళ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అవన్నీ కలిసి అన్నాడియంకె నాయకత్వ పగ్గాలు శశికళ చేతికి వచ్చాయి.
అజిత్‌కు సినిమా రంగం నుంచి ఇప్పుడే తప్పుకోవాలని లేదని, అందుకే ఆయన ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అందుకే ఆయన ఇటీవల ఆయన శశికళను రహస్యంగా కలిశాడని అంటున్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చిన్నమ్మకు నేరుగా చెప్పేశాడని ప్రచారం జరిగింది. అజిత్ నిర్ణయమే శశికళను పార్టీ నేతగా నిలబెట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications