సల్మాన్ ఖాన్ హత్యకు పాక్ నుండి ఏకే 47.. లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ భారీకుట్ర!!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భారీ ప్లాన్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికల పైన నిఘా పెట్టినట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
సల్మాన్ ఖాన్ ను చంపేందుకు పాక్ నుండి ఏకే 47
సల్మాన్ ఖాన్ కదలికల పైన ఫోకస్ పెట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని, ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేసింది. దీనికోసం పాకిస్తాన్ నుంచి ఏకంగా ఏకే 47 సహా, పలు ఆయుధాలను కొనుగోలు చేసింది. తాజాగా ఈ సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు.

సల్మాన్ ఇంటివద్ద కాల్పుల కేసులో షాకింగ్ విషయాలు
సల్మాన్ ఖాన్ ను అంతమొందిస్తామని గతంలో ప్రతిజ్ఞ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు షాక్ కు గురిచేసాయి. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి విచారించిన పోలీసులు, సల్మాన్ ను హత్య చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన భారీ ప్రణాళికను బయటపెట్టారు.
సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ 25 మందితో నిఘా
సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా 25 మందిని రంగంలోకి దించారు అన్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటివద్ద, పన్వేల్ లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద హీరో కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు గ్యాంగ్ సభ్యులు తిష్ట వేసి ఉన్నారన్నారు.
సల్మాన్ ను జింకల కేసు నాటినుండి వెంటాడుతున్న బిష్ణోయ్ గ్యాంగ్
రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయనను చంపేందుకు పాకిస్తాన్ కి చెందిన ఒక ఆయుధాల సప్లయర్ నుంచి ఏకే 47, ఎం 16, ఏకే 92, హై కాలిబర్ తెప్పించినట్టు పోలీసులు వెల్లడించారు. బిష్ణోయ్ గ్యాంగ్ తాజా కుట్రలతో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications