Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అఖిలేష్ యాదవ్ దూరం: పోటీకి నిరాకరణ

లక్నో: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయగల శక్తిసామర్థ్యాలు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు ఉంది ఉత్తర ప్రదేశ్‌కు. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇక్కడ మెజారిటీ ఎంపీ స్థానాలను సాధించిన పార్టీ- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటుందనే విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. అలాగే- అసెంబ్లీ స్థానాలు కూడా ఎక్కువే. ఏ రాష్ట్రంలో లేనన్ని శాసన సభ నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి. 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో.

ఎన్నికల హీట్..

ఎన్నికల హీట్..

అలాంటి అతిపెద్ద ఉత్తరప్రదేశ్.. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. దీనికోసం అన్ని పార్టీలు కూడా కసరత్తు మొదలు పెట్టేశాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. అదే సమయంలో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్.. వేటికవే తమ ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

 పోటీకి దూరం..

పోటీకి దూరం..


ఈ క్రమంలో- సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే ఏడాది నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నుంచి పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఎన్నికలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే- రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని, సీట్ల పంపకాలను త్వరలో తేల్చుతామని చెప్పారు.

జాతీయ రాజకీయాలపైనే ఫోకస్..

జాతీయ రాజకీయాలపైనే ఫోకస్..

ప్రస్తుతం ఆయన ఆజంగఢ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో అఖిలేష్ యాదవ్.. ఈ స్థానం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన దినేష్ లాల్ యాదవ్ నిరాహువాపై రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతానని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు.

బాబాయ్ పార్టీతో

బాబాయ్ పార్టీతో

తన బాబాయ్ శివ్‌పాల్ యాదవ్ నెలకొల్పిన ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీతో పొత్తు విషయంపైనా ఓ స్పష్టత ఇచ్చారు. ఆ పార్టీతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. శివ్‌పాల్ యాదవ్, ఆయన పార్టీకి చెందిన నాయకులను గౌరవిస్తానని అన్నారు. 2017లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసి పడేసింది. 403 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిపి బీజేపీకి ఉన్న సీట్ల సంఖ్య 312. సమాజ్‌వాది పార్టీ 47 నియోజకవర్గాలకే పరిమితమైంది.

పెద్ద పార్టీలతో పొత్తుకు దూరం..

పెద్ద పార్టీలతో పొత్తుకు దూరం..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలున సాధించడానికి కసరత్తు చేస్తోంది. పెద్ద పార్టీలతో తాము పొత్తు పెట్టుకోవట్లేదని అఖిలేష్ యాదవ్ ఇదివరకే స్పష్టం చేశారు. దీనివల్ల ఆయన కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీలకు తలుపులు మూసివేసినట్టయింది. ఈ రెండు పార్టీలు కూడా సొంతంగానే ఎన్నికల బరిలో నిల్చోవడం ఖాయమైంది. హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడటం జరిగితే- బీజేపీకి అధికారాన్ని దక్కనివ్వకుండా- మళ్లీ చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు.. మహారాష్ట్ర తరహాలో.

ఖేలా హొబె తరహాలో..

ఖేలా హొబె తరహాలో..

బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఖేలా హొబే ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే తరహాలో అఖిలేష్ యాదవ్ కూడా ఖదెడా హొబే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇదే నినాదంతో తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని అన్నారు. అన్ని రంగాల్లోనూ విఫలమైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఈ దఫా పరాభవం తప్పదని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+