వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cyrus Mistry: పల్లోంజి కుటుంబం నుంచి వచ్చి టాటా గ్రూప్ ఛైర్మన్ వరకు ఎదిగారు, కానీ

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా సన్స్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సైరస్ మిస్త్రీ (54) అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా.. పొరుగున ఉన్న ముంబై సమీపంలో వాహనం ప్రమాదానికి గురైంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు మిస్త్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సైరస్ మిస్త్రీ మరణానికి సంతాపం తెలిపారు. పారిశ్రామిక రంగానికి మిస్త్రీ చేసిన సేవలను కొనియాడారు.

Recommended Video

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు *National | Telugu OneIndia
సైరస్ మిస్త్రీ పారిశ్రామిక ప్రస్థానం

సైరస్ మిస్త్రీ పారిశ్రామిక ప్రస్థానం

షాపూర్జీ పల్లోంజీ కుటుంబంలోని దివంగత పల్లోంజి మిస్త్రీ కుమారుడు సైరస్ మిస్త్రీ. 1930లలో మిస్త్రీ తాత షాపూర్జీ మిస్త్రీ తొలిసారిగా టాటా సన్స్‌లో వాటాను పొందారు. సైరస్ మిస్త్రీ తన కంపెనీ సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2018లో, ఆయన నికర విలువ సుమారు $10 బిలియన్లు.

టాటా గ్రూప్ ఛైర్మన్‌గా నియమితులైన మిస్త్రీ.. ఆ తర్వాత

మిస్త్రీ 2012లో టాటా గ్రూప్‌కి ఆరవ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అక్టోబరు 2016లో టాటా సన్స్ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించే వరకు సైరస్ మిస్త్రీ, టాటా మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే కనిపించాయి. మిస్త్రీ తొలగింపు తర్వాత, సైరస్ మిస్త్రీ, టాటా మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఐదు సంవత్సరాలుగా అత్యంత ఉన్నత స్థాయి బోర్డ్‌రూమ్ యుద్ధాలు జరిగాయి.

మిస్త్రీ వర్సెస్ టాటా లీగల్ బ్యాటిల్

మిస్త్రీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం కల్పించిన తర్వాత, అక్టోబర్ 2016లో, సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డు ఓటు వేసింది. బోర్డు సమావేశం ముగిసిన వెంటనే మిస్త్రీని తొలగిస్తున్నట్లు ప్రకటించడం కార్పొరేట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. సైరస్ మిస్త్రీ తొలుత 2016 అక్టోబర్‌లో ఛైర్మన్‌గా తన తొలగింపును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు సవాలు చేశారు. కానీ తదనంతరం, 2021లో సుప్రీంకోర్టు.. ఆయనను చైర్మన్‌గా తిరిగి నియమించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మిస్త్రీ భావోద్వే ప్రకటన చేశారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగిన సమయంలో తాను శక్తివంచన లేకుండా సంస్థ, దేశాభివృద్ధికి తనవంతుగా కృషి చేశానని చెప్పారు. పారిశ్రాకి రంగంలో ఇంకా ఎంతో సేవ చేయాల్సిన మిస్త్రీ హఠాన్మరణం ఆ రంగానికి తీరని లోటని వ్యాపార దిగ్గజాలు పేర్కొంటున్నారు.

English summary
All about the former Tata Sons chairman Cyrus Mistry, who killed in car accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X