ఒలింపిక్స్‌లో మెడల్స్ గెలిస్తే ప్రభుత్వం ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంతో తెలుసా..?

ఉత్తర్ ప్రదేశ్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.

గోరఖ్‌పూర్ : పంటల ఎగుమతి కోసం గోరఖ్‌పూర్‌లోని దక్షిణాచల్‌లో వాటర్ వే ఫెసిలిటీని నిర్మిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. వాటర్ వే నిర్మాణం పూర్తయ్యాక దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇక్కడ పండిన కూరగాయలను ఎగుమతి చేస్తామని వివరించారు. ఆదివారం సన్సాద్ ఖేల్ మహాకుంభ్ ముగింపు కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు గోరఖ్‌పూర్‌లోని దక్షిణాచల్ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఉండేవని సీఎం గుర్తు చేశారు. ఇక ధురియాపూర్, గోలా, సీక్రిగంజ్, ఖాజానీ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్‌లు వస్తున్ననేపథ్యంలో ఇక వలసలకు బ్రేక్ పడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లనవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించిందని గుర్తు చేశారు.

All necessary actions are being taken to promote sports in uttar Pradesh, says CM Yogi Adityanath

ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం క్రీడలను ప్రమోట్ చేసేందుకు కట్టుబడి ఉందని చెప్పిన సీఎం...ఇందుకు నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయని అన్నారు. క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ఇందులో భాగంగా ప్లేగ్రౌండ్స్‌ను అభివృద్ధి చేసిందని చెప్పారు. ప్రతి గ్రామంలో జిమ్‌ను ప్రారంభించినట్లు సీఎం వెల్లడించారు.జిల్లా స్థాయిలో స్టేడియంలు, మినీ స్టేడియంలను నిర్మించినట్లు చెప్పారు. 1994 తర్వాత స్పోర్ట్స్ హాస్టల్స్‌కు కావాల్సిన వస్తువులపై పెద్దగా ఖర్చు చేయలేదని సీఎం అన్నారు. ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఈ చర్యలకు ఉపక్రమించిందన్నారు.

All necessary actions are being taken to promote sports in uttar Pradesh, says CM Yogi Adityanath

క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఉచితంగా ఏసీ 3 క్లాస్ ప్రయాణం కల్పిస్తోందని చెప్పారు. దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీ మేజర్ ధ్యాన్ ‌చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీని మీరట్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సీఎం యోగీ... ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఒలంపిక్ మరియు ఆసియా గేమ్స్‌లో మెడల్స్‌ సాధించిన క్రీడాకారులకు క్యాష్ ప్రైజ్ ప్రోత్సాహకాన్ని కూడా పెంచినట్లు సీఎం స్పష్టం చేశారు.

All necessary actions are being taken to promote sports in uttar Pradesh, says CM Yogi Adityanath

ఒలింపిక్స్‌ సింగిల్ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించినవారికి రూ.6 కోట్లు, రజత పతక విజేతలకు రూ.4 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.2 కోట్లు క్యాష్ ప్రైజ్ అందిస్తామని సీఎం యోగీ వివరించారు. ఇక రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. సన్సాద్ ఖేల్ మహాకుంభ్‌‌ ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన యోగీ... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2000 నుంచి 2500 మంది క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి చూస్తే ఈ సంఖ్య 2 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+