బక్రీద్ వేడుకలు, సీఎంకు అఖిల పక్ష సంఘాలు వార్నింగ్, ఏం జరుగుతుందో అంటూ !

బెంగళూరు: బక్రీద్‌ పండుగకు ముందే బెంగళూరులోని ఈద్గా మైదానంలో వివాదం తెరపైకి వచ్చింది. బెంగళూరు నగరంలోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలోకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తారని జోరుగా ప్రచారం జరగడంతో అఖిలపక్ష సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇప్పటి వరకు ఈద్గా మైదానంలో కన్నడ రాజ్యోత్సవాలు, గణేశుడి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు బక్రీద్ పండుగ వేడుకల కోసం ఎలా అనుమతి ఇస్తారని పలు సంస్థలు బీబీఎంపీ అధికారులను నిలదీస్తున్నారు.

జూన్ 29వ తేదీన బెంగళూరు నగరంలోని చామరాజపేట్ క్రీడా మైదానంలో జరిగే బక్రీద్ పండుగ వేడుకు ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. చామరాజపేట్ క్రీడా మైదానంలో పాల్గొనేందుకు సీఎం సిద్ధరామయ్య చామరాజ్‌పేటలోని ఈద్గా మైదాన్‌కు వస్తున్నారని పలు సంఘ, సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

idgahmaidan1

సీఎం సిద్ధరామయ్యను ఈద్గా మైదానంలోకి రానివ్వవద్దని అఖిల పక్షసంఘాలు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం సిద్దరామయ్య బక్రీద్ వేడుకలకు రాకుండా మీరే చూడాలని అఖిల పక్ష సంఘాలు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు విజ్ఞప్తి చేశాయి. ఇదే సమయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని సీఎం సిద్ధరామయ్య ఇక్కడికి వస్తే నిరసన తెలుపుతామని అన్ని సంస్థలు, సంఘాలు హెచ్చరించాయి.

చామరాజ్‌పేట ఎమ్మెల్యే, మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్ ఆహ్వానం మేరకు సీఎం సిద్ధరామయ్య బక్రీద్‌ వేడుకల్లో పాల్గొంటున్నారు. వివాదాస్పద స్థలం కావడంతో ఈ వేడుకలో సీఎం సిద్దరామయ్య పాల్గొనకూడదనేది ఆయా సంస్థల వాదన. ఇంతకు ముందు ఈద్గా మైదానంలో అని ఇప్పుడు క్రీడామైదానం అని పిలుస్తున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని సీఎం సిద్ధరామయ్య ఇక్కడికి వస్తున్నారు.

ఇది వివాదాస్పద స్థలం అని, ఏ కారణం చేతనైనా సీఎం సిద్దరామయ్య ఇక్కడికి వచ్చి వేడుకల్లో పాల్గొనకూడదని, అలా చేస్తే ఒక్క వర్గానికి మాత్రమే సీఎం మద్దతిస్తున్నారని ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలుతాయని, ఆయన ఇక్కడికి వస్తే ఇంతకు ముందు సిద్దరామయ్యకు ఉన్న సెక్యులర్ నాయకుడిగా పేరు చెడిపోతుంది ఆల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ నాయక్ అన్నారు.

బక్రీద్ వేడుకల నేపథ్యంలో ఈద్గా మైదానాన్ని శుభ్రం చేస్తున్నారు. వందలాది మంది ముస్లిం యువకులు మైదానాన్ని శుభ్రం చెయ్యడానికి స్వచ్చందంగా తరలి వచ్చారు. బక్రీద్ పండుగ రోజున వేలాది మంది ముస్లింలు ఇక్కడ సామూహిక ప్రార్థనలు చేస్తారు. బక్రీద్ జరుపుకోవడానికి మేం వ్యతిరేకం కాదు. అయితే ఈద్గా మైదానంలో జరిగే బక్రీద్ వేడుకల్లో సీఎం సిద్ధరామయ్య పాల్గొనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్ని సంస్థల యూనియన్ స్పష్టంగా ప్రకటించింది. బీబీఎంపీ అధికారులకు ఈ విషయంపై లేఖ రాయాలని కూడా సంఘం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+