18న అఖిలపక్ష సమావేశం.. పెట్రో ధర, మహమ్మరియే ప్రధాన అంశాలు..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఒక ముందు 18వ తేదీన అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం నిర్వహిస్తారు. కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు సభ సజావుగా సాగేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ఆగస్ట్‌ 13 వరకు కొనసాగనుండగా.. కేంద్ర ప్రభుత్వం సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

all party meeting to be held on 18th july

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌, ప్రహ్లాద్‌ జోషి, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌తో పాటు 20 మంది వరకు బీజేపీ సీనియర్‌ నేతలు సమావేశమై చర్చించారు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, కొవిడ్‌-19 మహమ్మారిపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధం అవుతున్నాయి.

ఇటీవల మోడీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. కొత్త క్యాబినెట్ ఇవాళ సమావేశం కూడా జరిగింది. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అస్త్ర శస్త్రాలతో కేంద్రం సిద్దంగా ఉంది. ఇటు వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్షకాల సమావేశాల్లో తమ నిరసన తెలియజేస్తామని ఇప్పటికే నేత రాకేశ్ టికాయత్ స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+