ఢిల్లీలో స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రస్తుతం ఒక ప్రధాన ఆందోళనగా మారింది. రాజధాని నగరం తరచూ ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో కూడిన నగరాల జాబితాలో నిలుస్తుంది. ఈ తీవ్రమైన కాలుష్యం అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది మరియు దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడేడ్ రెస్పాన్స్ యాక్షన్స్ ప్లాన్ -4 కింద ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. ఇవన్నీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి రానున్నాయి.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలను మూసీ వేసింది. అన్ని తరగతులకు కేవలం ఆన్లైన్ నిర్వహించాలని ప్రకటన విడుదల చేశారు. అన్ని నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 457కి పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసుల సమయంలో సైతం మార్పులు చేయడం జరిగింది.

కాలుష్యం యొక్క కారణాలు
పొలాలను కాల్చడం వల్ల వెలువడే పొగ మరియు పార్టిక్యులేట్ మ్యాటర్ కాలుష్యానికి ప్రధాన కారణం.వాహనాల నుండి వెలువడే విషపూరిత వాయువులు గాలిని కలుషితం చేస్తాయి.పారిశ్రామిక కార్యకలాపాలు కూడా గాలిలోకి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయి.
నిర్మాణ కార్యకలాపాలు మరియు గాలిలో తేలియాడే ధూళి కణాలు కూడా గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి.చలికాలంలో గాలి స్థిరంగా ఉండటం వల్ల కాలుష్యం మరింతగా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications