కాంగ్రెస్ స్థానంలో ఆప్ - అయిదేళ్లలో అనూహ్యంగా : రెండు పార్టీల సీట్లు రివర్స్..!!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లో తిరిగి యోగీ సీఎం కానున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ప్రచారం చేసిన మోదీ - యోగీ డబుల్ ఇంజిన్ ప్రచారం బాగా పని చేసినట్లుగానే కనిపిస్తోంది. ధీమాగా కనిపించిన ఎస్పీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక, ఆ తరువాత అందరి ఫోకస్ పంజాబ్ మీదే ఉంది. పంజాబ్ లో మాత్రం ఆప్ ఈ సారి కీలకంగా మారుతుందని అందరూ అంచనా వేసారు. కానీ, ఏకపక్షంగా విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి.
Recommended Video
2017 ఎన్నికల్లో కాంగ్రెస్ - ఆప్ సాధించిన ఫలితాలు 2022 లో రివర్స్ కాబోతున్నట్లుగా సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 77 సీట్లు దక్కి అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆప్ ఆ ఎన్నికల్లో 20 సీట్లు దక్కించుకుంది. కాగా, శిరోమణి అకాలీ దల్ - 15, బీజేపీ -3 స్థానాల్లో విజయం సాధించాయి. ఇప్పుడు 2022 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో శిరోమణీ అకాళీ దల్ గతం కంటే తగ్గినట్టుగా కనిపిస్తోంది. సర్వేల్లో శిరోమణి అకాలీదళ్ మూడో స్థానానికి పరిమితం అయినట్లు తేల్చాయి. ఇక, బీజేపీ గతంలో వలే అదే స్థానాలు దక్కించుకోనుంది.
అయితే, 2017 ఎన్నికల్లో ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసిన ఇండియా టూడే సైతం ఈ ఎన్నికల్లో ఆప్ కు 76 -90 సీట్లు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ కు 19- 31 వరకు స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ ఓట్ల శాతం వాస్తవ రూపం దాల్చితే పంజాబ్ లో ఆప్ కు 42 శాతం వరకరు ఓట్ షేర్ వచ్చినట్లుగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కు 28, అకాళీ దళ్ కు 20, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 1-2 శాతం కనిపిస్తోంది. పంజాబ్ లో బహుముఖ పోరులో ఆప్ స్పష్టమైన ఆధిక్యత సాధిస్తోంది.

2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ..ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్‌పైపు పంజాబ్ ప్రజలు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండో స్థానానికి పడిపోయారు. భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది, ఛన్నీ సీఎం కావాలని 30 శాతం మంది కోరుకున్నారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌వైపు 20 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వే సంస్థలు తేల్చాయి.












Click it and Unblock the Notifications