పంజాబ్ లో కేజ్రీ మ్యాజిక్ - పంజాబ్ లో ఊడ్చేసింది : ఎగ్జిట్ పోల్స్ భారీ మెజార్టీ..!!
పంజాబ్ లో కేజ్రీ మ్యాజిక్ వర్కవుట్ అయింది. ఇతర పార్టీలను ఊడ్చేసింది. అయిదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స లో భాగంగా.. వెల్లడైన అంచనాల్లో అన్ని సంస్థలు పంజాబ్ లో ఏకపక్షంగా ఆప్ విజయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం నిలబెట్టుకోవటానికి అనేక సమీకరణాలు తెర మీదకు తెచ్చింది. సీఎంను మార్పు చేసింది. ఎస్సీ వర్గానికి సీఎం పీఠం కట్టబెట్టింది. అసమ్మతి నేతగా మారిన సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. అదే సమయంలో రాహుల్.. ప్రియాంక అక్కడ ప్రచారం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
Recommended Video
ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో 60 సీట్లకు పైగానే ఆప్ కు దక్కుతాయని తేల్చాయి. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వాటిలో 34 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా అన్ని సర్వేలను పరిశీలిస్తే పంజాబ్ లో ఆప్ కు 64 స్థానాల నుంచి 78 సీట్ల మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండియా టూడే సర్వే ప్రకారం ఆప్ కు 76 -920 స్థానాలు, కాంగ్రెస్ కు 19-31 స్థానాలు, శిరోమణీ అకాలీ దల్ కు 7-11 సీట్లు, బీజేపీకి 1-3 సీట్లు దక్కే అవకాశం ఉందని తేల్చింది.

అదే విధంగా సీఎన్ఎన్ ఛానల్ సర్వేలో కాంగ్రెస్ కు 19-31, ఆప్ కు 76-90, శిరోమణీ అకాలీదళ్ కు 7-11, బీజేపీకి 1-3 స్థానాలు దక్కుతాయని తేల్చింది. జగన్ కీ బాత్... ఆజ్ తక్ / యాక్సిస్ మై ఇండియా సర్వే సైతం ఆప్ కు 60-84 సీట్లు వస్తాయని తేల్చాయి. ఇక, రిపబ్లిక్ టీవీ సర్వే సైతం ఆప్ కే పట్టం ఖాయమని చెప్పుకొచ్చింది. ఆప్ కు పంజాబ్ లో 62 -70 సీట్లు దక్కే అవకాశం ఉందని తేల్చింది. అయితే, బీజేపీతో విభేదించి ఈ సారి కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామని భావించిన శిరోమణి అకాలీ దల్ నామ మాత్రపు పోటీకి పరిమితం అయింది. సింగిల్ డిజిట్ స్థానాలే వస్తాయని సర్వేలు తేల్చాయి.












Click it and Unblock the Notifications