రాష్ట్రంలో ప్రతి మహిళకూ రూ.1,500 నగదు: జులై నుంచి అమలు

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా.. హామీలను అమలు చేయడంపై దృష్టిసారించాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటను నిలుపుకొనే పనిలో పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలుపై కసరత్తు పూర్తి చేస్తోంది.

తాజాగా- మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో చేరింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ముఖ్యమంత్రి మాఝీ లడకీ, బెహన్ కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించేలా రూపొందించిన పథకం ఇది. ఈ పథకం అమలు తేదీని సైతం ఖరారు చేసింది.

All women in Maharashtra will receive Rs 1500 per month from July 2024

జులై 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ పథకం వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని, మహిళలు ఆర్థిక తమ కాళ్ల మీద తాము నిలబడేలా వారికి చేయూతను అందించడం లక్ష్యమని అన్నారు.

ముఖ్యమంత్రి మాఝీ లడకీ, బెహన్ పథకం కింద జులై నుంచి ప్రతి మహిళకూ 1,500 రూపాయలను చెల్లిస్తామని అజిత్ పవార్ ప్రకటించారు. ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి మహారాష్ట్ర అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినందుకు హర్షం వ్యక్తం చేసింది.

All women in Maharashtra will receive Rs 1500 per month from July 2024

కాగా- ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 5,41,31,277 మంది మహిళలు ఉన్నారు మహారాష్ట్రలో. వారందరికీ ప్రతి నెలా 1,500 రూపాయలను చెల్లిస్తుందా? లేక వయస్సును ప్రాతిపదికగా లేక, కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ మొత్తం ఇస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+