రైల్వేస్టేషన్ లో పసుపురంగు బోర్డుల వెనక ఉన్న సైన్స్ ఏమిటి?
భారతీయ రైల్వేకు, భారతీయులకు వీడదీయరాని బంధం ఉంది. వారి జీవితంతో రైళ్లు ముడిపడ్డాయి.
మనకు ఏ రైల్వే స్టేషన్‌లో చూసినా ఆ స్టేషన్ పేరు తెలియజేసే బోర్డు పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగు బోర్డుపై నలుపు రంగు అక్షరాలతో ఆ స్టేషన్ పేరు రాసివుంటుంది. ఆ సైన్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు..

విడదీయరాని బంధం
భారతీయులకు, రైళ్లకు విడదీయరాని బంధం ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా రైలు కచ్చితంగా ఎక్కుతారు. తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు లక్షల సంఖ్యలో ఉంటారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే రైలులోనే ప్రయాణిస్తారు. ఇలా భారతీయులకు రైల్వే ప్రయాణం తమ జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది.
రైలు టికెట్ బుక్ చేయడం , రైలు ఎక్కడం, గమ్య స్థానాలకు చేరడం... ఇవన్నీ సహజాతి సహజంగా జరుగుతూ ఉంటాయి. వారి రైల్వే ప్రయాణ సమయంలో అనేక సందేహాలు తొలిచేస్తూ ఉంటాయి. రెండు పట్టాల మధ్య కంకరరాళ్లు ఎందుకుంటాయి? రైల్వేస్టేషన్ లో బోర్డులు పసుపురంగులోనే ఎందుకుంటాయి? దీనికేమైనా సైన్స్ ఉందా? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. రైల్వే టీటీఈలు వేసుకునే డ్రెస్ వరకు అన్నీ సందేహాలే.

పసుపు రంగుపై నీలిరంగు అక్షరాలు
కొన్ని రైల్వేస్టేషన్ లో పసుపురంగుపై నీలిరంగు అక్షరాలు కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా ఏ రైల్వేస్టేషన్ లో చూసినా దాదాపు ఇలాగే ఉంటుంది. బోర్డులకు పసుపు రంగు వేయడం వెనక ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. విజిబిలిటీ స్పెక్ట్రంలో వేవ్ లెంథ్ పరంగా, ఏడు ప్రాథమిక రంగుల్లో పసుపు మూడోస్థానంలో ఉంటుంది.ఏ రంగుకైనా వేవ్‌లెంథ్ ఎంత ఎక్కువగా ఉంటే, చాలా దూరం నుంచి చూడొచ్చని అర్థం.
విజిబిలిటీ స్పెక్ట్రంలో ఎరుపు రంగు మొదటిస్థానంలో ఉంటుంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపడానికి, ఏదైనా వార్నింగ్ సిగ్నల్‌ను ఇవ్వడానికి ఎరుపు రంగును ఉపయోగిస్తారు. మిగతా రంగులతో పోలిస్తే ఎక్కువ ధూరం నుంచి ఎరుపు రంగును చూడొచ్చు.
రైల్వే ప్రయాణికులు మాత్రమే కాదు, రైలు నడిపే లోకో పైలట్ కూడా దూరం నుంచే రాబోయే స్టేషన్‌ను సులువుగా గమనించే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు రైల్వే స్టేషన్‌లో పసుపురంగును ఎందుకు ఉపయోగించారనే సందేహం అందరినీ వెంటాడుతుంది.

పసుపురంగు త్వరగా దృష్టిలో పడుతుందని
కంటిచూపు విషయానికి వస్తే ఎరుపు రంగు కన్నా పసుపు రంగు త్వరగా దృష్టిలో పడుతుంది. అంటే నేరుగా బోర్డును చూడకపోయినా తాము చూసే దృశ్యంలో పసుపు రంగు బోర్డు హైలైటవుతుంది. అంతే కాదు, చీకట్లో లేదంటే పొగమంచు వాతావరణంలో ఎరుపు రంగు కన్నా పసుపు రంగు కు ఎక్కువ స్పష్టత ఉంటుంది.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ స్టేషన్ రాబోతోందనే విషయాన్ని సులువుగానే తెలుసుకుంటున్నాం. జీపీఎస్ ద్వారా రాబోయే స్టేషన్ ఎంత దూరం ఉంటుందో లోకో పైలట్ కు తెలుస్తుంది. గతంలో దూరం నుంచి ఈ పసుపు రంగు బోర్డును గమనించి రైలు వేగాన్ని పైలట్ తగ్గించేవారు.












Click it and Unblock the Notifications