మసీదులో శివాలయం- సర్వేకు హైకోర్టు అంగీకారం: హర్షాతిరేకాలు

లక్నో: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదులో పురావస్తు శాఖ అధికారులు సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన తీర్పును వెలువడించింది. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు.

జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు చెబుతూ వస్తోన్నాయి. ఈ మేరకు కొందరు హిందూ సంఘాల ప్రతినిధులు మసీదులో పూజలు చేయడానికీ ప్రయత్నించారు గతంలో. జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన.

gyanvapimosquecomplex1

దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను వారు అప్పట్లో న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలనీ అభ్యర్థించారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటీషన్‌ను ఇదివరకు వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జి విచారణ చేపట్టింది.

దీనికి కౌంటర్‌గా అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ పిటీషన్ దాఖలు చేసింది. హిందూ ధార్మిక సంఘాల తరఫున విష్ణు శంకర్ జైన్, అంజుమన్ కమిటీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మిరాకుద్దీన్ సిద్ధిఖీ తమ వాదనలను వినిపించారు. మసీదు కాంప్లెక్స్‌లో సంస్కృత శ్లోకాలు, పాత జ్యోతిర్లింగం, హిందూ కళాఖండాలు.. వంటివి ఉన్నాయని జైన్ వాదించారు.

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన న్యాయస్థానానికి సమర్పించారు. అలాగే- ఉత్తరం వైపున కొన్ని ఆలయ స్తంభాల నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లు కూడా ఉందని పేర్కొన్నారు. ఆ గుర్తులను దాచడానికి పదేపదే పెయింట్ చేశారని చెప్పారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉండే గుమ్మటాలు మసీదులో ఉన్నాయనీ అన్నారు.

allahabadhighcourtgyanvapimosque

అంజుమన్ కమిటీ పిటీషన్‌పై విచారణ చేపట్టడానికి వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ అజయ్ కృష్ణ విశ్వేశ నిరాకరించారు. హిందూ ధార్మిక సంఘాల పిటీషన్‌‌ మెయింటెయిన్ చేయాలంటూ అప్పట్లో ఆదేశించారు. శివాలయం ఉందా? లేదా? అనేది నిర్ధారించడానికి ఆర్కియాలాజికల్ విభాగంతో సర్వే జరిపించాలంటూ ఆదేశించారు.

దీన్ని అంజుమన్ కమిటీ వ్యతిరేకించింది. హైకోర్టులో సవాల్ చేసింది. మసీదులో శివాలయం ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేలా పురావస్తు శాఖ సర్వే నిలిపివేయాలంటూ అంజుమన్ కమిటీ పిటీషన్ దాఖలు వేసింది. ఆయా పిటీషన్లన్నింటి పైనా అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది.

వారం రోజుల కిందటే ఈ విచారణను హైకోర్టు ముగించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు అప్పట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ తెలిపారు. ఇవ్వాళ తాజాగా తన తీర్పును వినిపించారాయన. మసీదు లోపల శివాలయం ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి పురావస్తు శాఖతో సర్వే జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.

దీన్ని అడ్డుకోవాలంటూ అంజుమన్ కమిటీ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టేశారు. సైంటిఫిక్ సర్వే ద్వారా మాత్రమే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. గతంలో వారణాశి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను నిర్ధారించడానికి వారణాశి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి మతపరమైన అంశాలకు చోటు ఉన్నట్లు కనిపించట్లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+