కృష్ణజన్మభూమి కేసు ముందుకే-అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..!
ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో ఉన్న దశాబ్దాల నాటికి శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఇవాళ మరో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో షాహీ ఈద్గాను కృష్ణజన్మభూమిలో కొంతభాగం కూల్చి కట్టారని ఆరోపిస్తూ హిందూపక్షం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతను ప్రశ్నిస్తూ ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతుందని ప్రకటించింది.
కృష్ణజన్మభూమిలో కొంతభాగం కూల్చి మధురలో షాహీ మసీదు నిర్మించినందున ఆ స్థలం తమకు అప్పగించాలంటూ హిందూ పక్షం నుంచి దాఖలైన 18 పిటిషన్లపై విచారణ చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టంతో పాటు పలు చట్టాలను ముస్లిం పక్షం ప్రస్తావించింది. స్వాతంత్రానికి పూర్వం నిర్మించిన కట్టడాలను ధ్వంసం చేయరాదని వాదించింది. అయితే అలహాబాద్ హైకోర్టులో సింగిల్ జడ్జి మాయాంక్ కుమార్ జైన్ మాత్రం ఈ వాదనలతో విభేదించారు.

ఇవాళ ముస్లిం పక్షం పిటిషన్ ను కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు హిందూపక్షం దాఖలు చేసిన 18 పిటిషన్లపై విచారణ కొనసాగింపుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే మధుర స్థానిక కోర్టు షాహీ ఈద్గా మసీదు స్థలంలో సర్వేకు కూడా అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో ఇది కూడా కొనసాగనుంది. దీనిపై ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనుంది.












Click it and Unblock the Notifications