లఢక్ సరిహద్దు ఘర్షణల్లో 5 మంది చైనా సైనికులు మృతి: మీడియా కథనాలపై నోరువిప్పని డ్రాగన్

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో భారత్, చైనా సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న ఘర్షణల్లో చైనా కూడా ప్రాణనష్టాన్ని చవి చూసినట్లు ఆ దేశ మీడియా వెల్లడిస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన అయిదుమంది సరిహద్దు భద్రతా సైనికులు ఈ ఘర్షణల్లో చనిపోయినట్లు పేర్కొంది. భారత్ సైనికులు ఉద్దేశపూరకంగా ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. మొదటగా వారే తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చినట్లు కథనాలను ప్రచురిస్తోంది.

భారత్‌ సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణల్లో అయిదుమంది పీఎల్ఏ జవాన్లు మరణించినట్లు గ్లోబల్ టైమ్స్‌ను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది ఆ దేశ మీడియా. చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి మౌత్‌పీస్‌గా గుర్తింపు ఉన్న మీడియా హౌస్ గ్లోబల్ టైమ్స్. చైనా సైనికులు మరణించిన విషయాన్ని తాము ధృవీకరించలేదని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా సైన్యం ప్రాణనష్టాన్ని చవి చూసినట్లు ఇప్పటిదాకా తాము ఎక్కడా ధృవీకరించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

Allegedly 5 Chinese soldiers killed, 11 injured at the China-India border clash

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మృతి చెందారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నప్పటికీ.. ప్రభుత్వాధినేతలు మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. మీడియాలో వస్తోన్న కథనాలను తోసి పుచ్చట్లేదు. అలాగనీ సమర్థించనూ లేదు. అదే సమయంలో- రెండు వైపులా ప్రాణనష్టం సంభవించిందంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన ప్రకటనల పట్ల కూడా చైనా ప్రభుత్వం తన స్పందనను తెలియజేయట్లేదు.

అయినప్పటికీ- అయిదుమంది పీఎల్ఏ సైనికులు మరణించినట్లు చైనా మీడియా చెబుతోంది. రెండు దేశాల సైనికులు ఒకరినొకరు బాహాబాహికి దిగారని, రాళ్లు రువ్వుకున్నారనీ చైనా మీడియా పేర్కొంటోంది. ఒక దశలో కాల్పులు కూడా చోటు చేసుకున్నట్లు పీఎల్ఏ అధికారులను ఉటంకిస్తూ కథనాలను రాసుకొచ్చింది. అదే సమయంలో- కాల్పులు చోటు చేసుకున్నాయనడానికిి ఎలాంటి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేస్తోంది.

Recommended Video

    Coronavirus To End On June 21 Solar Eclipse 2020, Scientist Claims!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+