అమర్‌నాథ్ యాత్రపై రెడ్ అలర్ట్.... యాత్రికులు త్వరగా వెళ్లిపోవాలని అధికారుల ఆదేశం..!
జమ్ము కశ్మీర్‌లో అమర్ నాథ్ యాత్రికులు,టూరిస్టులు ఎక్కువ రోజులు ఉండవద్దంటూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. యాత్ర స్థలాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వీలైనంత తొందరగా అమరనాథ్ యాత్రికులు దర్శనం అయిన వెంటనే తిరిగి వెళ్లిపోవాలని, నోటీసులో పేర్కోంది. మరోవైపు టూరిస్టులు కూడా వ్యాలీలో ఎక్కువ రోజులు బస చేయకూడదని జమ్మూ ప్రభుత్వం విజ్ణప్తి చేసింది.

అమర్‌నాథ్ యాత్రపై దాడులు చేసే అవకాశం
కాగా అంతకుముందే జమ్ము కశ్మీర్ డీజీపీతో పాటు, సీఆర్పీఎఫ్, లెఫ్టినెంట్ కల్నల్ మీడీయా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలోనే పాక్ ఆర్మీ సాయంతో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నిందని తెలిపారు. యాత్ర వెంట ఉన్న ప్రాంతాల్లో తీవ్రవాదులు ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసినట్టుగా భారత్ ఆర్మీ అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు కార్ప్స్ ఏరియా కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ థిల్లాన్ తెలిపారు.

అమర్‌నాథ్ యాత్రలో ల్యాండ్‌మైన్లు,
ఆర్మీ తనిఖీల్లో శక్తివంతమైన ఐఈడీలు, నాటు బాంబులు, టెలీస్కోప్, M-24 American sniper రైఫిల్ అమర్‌నాథ్ రూట్లో దొరికినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఏమైన ల్యాండ్ మైన్లు ఉన్నాయనే అనుమానతం విస్తృతంగా గాలింపు జరుగుతున్నట్లు ఆర్మీ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే వాటిని స్వాధినపరుచుకున్న పోలీసులు మీడీయా ముందు ప్రదర్శించారు.

భద్రతా దళాల ఎఫెక్ట్,
కాగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370,తోపాటు 35ఏను తొలగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. దీంతో వాటి తొలగింపుపై స్థానిక రాజకీయ పార్టీలతోపాటు కశ్మీరులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడ ముందు జాగ్రత్త చర్యగా 10వేల మంది భద్రతా దాళాలను కశ్మీర్ లోయ ప్రాంతంలోకి తరలించాయి. దీంతో తీవ్రవాదులు ప్రతికార చర్యలు తీసుకునేందుకు దాడులు చేసేందుకు సన్నమద్దవుతున్నారు. అమర్‌నాథ్ యాత్రపై దాడి కొనసాగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ప్రభుత్వం కూడ అనే విమర్శలు ఎదుర్కోనే అవకాశాలు ఉన్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications