అమర్‌నాథ్ యాత్రపై అప్‌డేట్ ఇదే

శ్రీనగర్: మొన్నటివరకు జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురిశాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోండటం వల్ల అమర్‌నాథ్‌ను దర్శించడానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు గుర్తించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇప్పుడు వాతావరణం కొంతమేరకు తెరపినిచ్చింది. కాశ్మీర్‌లో వచ్చే 48 గంటల పాటు సాధారణ వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుగుణంగా శనివారం రాత్రి వర్షం పడట్లేదు. అడపా దడపా తేలికపాటి జల్లులు పడుతున్నాయే తప్ప- భారీ వర్షపాతం నమోదు కాలేదు.

Amarnath yatra

వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో- అధికారులు ఈ ఉదయం అమర్‌నాథ్ యాత్రను పునరుద్ధరించారు. పంజ్‌తర్ణి, శేష్‌నాగ్ బేస్ క్యాంప్‌ల వద్ద నుంచి అమర్‌నాథ్ యాత్ర ఇవ్వాళ ఆరంభమైంది. మూడు రోజుల తరువాత అమర్‌నాథ్ యాత్రను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. అమర్‌నాథుడిని దర్శించుకున్న అనంతరం భక్తులు బల్తాల్ బేస్ క్యాంప్‌కు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదివరకు ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం.. ఇవ్వాళ ఎనిమిదో బ్యాచ్ అమర్‌నాథ్ దర్శనానికి బయలుదేరి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఎనిమిదో బ్యాచ్‌లో మొత్తం 7,010 మంది యాత్రికులు ఉన్నారు. వారంతా ఇవ్వాళ అమర్‌నాథుడి గుహాలయం వైపు బయలుదేరి వెళ్లారు.

Amarnath yatra

వారిలో 5,179 మంది పురుషులు, 1,549 మంది మహిళలు, 21 మంది పిల్లలు, 228 మంది సాధువులు, 33 మంది మహిళా సాధువులు ఉన్నారు. వారంతా 247 వాహనాల్లో వారిని బల్తాల్ పహల్గామ్‌ బేస్ క్యాంప్స్ నుంచి వెళ్లాల్సి ఉంది. అమర్‌నాథ్ యాత్ర మొత్తం 62 రోజుల పాటు సాగుతుంది. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31వ తేదీ నాటికి ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+