Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమర్‌నాథ్ యాత్రపై తాజా అప్‌డేట్- అధికారుల కీలక నిర్ణయం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోండటం వల్ల అమర్‌నాథ్‌ను దర్శించడానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు గుర్తించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ తెల్లవారు జాము నుంచి అమర్‌నాథుడి గుహను సందర్శించడానికి యాత్రికులెవరికీ అనుమతించలేదని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల వల్ల బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు. వాతావరణం అనుకూలించిన తరువాతే- అమర్‌నాథ్ యాత్రను పునరుద్ధరిస్తామని చెప్పారు.

amarnathyathra

షెడ్యూల్ ప్రకారం.. ఇవ్వాళ ఎనిమిదో బ్యాచ్ అమర్‌నాథ్ దర్శనానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ బ్యాచ్‌లో మొత్తం 7,010 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 5,179 మంది పురుషులు, 1,549 మంది మహిళలు, 21 మంది పిల్లలు, 228 మంది సాధువులు, 33 మంది మహిళా సాధువులు ఉన్నారు. వారంతా 247 వాహనాల్లో వారిని బల్తాల్ పహల్గామ్‌ బేస్ క్యాంప్స్ నుంచి వెళ్లాల్సి ఉంది.

అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోన్నందు వల్ల వారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇవ్వాళ్టికి అమర్‌నాథ్ యాత్రను రద్దు చేశారు. వాతావరణం అనుకూలంగా లేదని వెల్లడించారు. వర్షాల వల్ల కొన్ని చోట్ల మార్గం ధ్వంసమైందనే సమాచారం ఉందని బేస్ క్యాంప్ వద్ద సిబ్బంది వెల్లడించారు. వర్షం తగ్గిన తరువాత పరిస్థితులను బట్టి పునరుద్ధరిస్తామని అన్నారు.

అమర్‌నాథ్ యాత్ర మొత్తం 62 రోజుల పాటు సాగుతుంది. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31వ తేదీ నాటికి ముగుస్తుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 80,000 మందికి పైగా భక్తులు అమర్‌నాథుడిని దర్శించుకున్నారు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది అమర్‌నాథుడి గుహ. లాడార్ లోయలో.. రాజధాని శ్రీనగర్ నుంచి 141 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

కాగా- అనంత్‌నాగ్, బుద్గామ్, గందర్‌బల్, కుల్గామ్, పుల్వామా, షోపియాన్, కిష్త్వార్, రాంబన్, రియాసి, సాంబా, దోడా, ఉధంపూర్, కథువా, జమ్ము, రాజౌరి జిల్లాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ది వెదర్ ఛానల్ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం వరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+