వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్ అద్భుత ఆఫర్ : కొనడమే కాదు, మీరూ అమ్మేయొచ్చు

ఇకమీదట అమెజాన్ వెబ్ సైట్ ద్వారా మీరు వస్తువులు కొనడమే కాదు, ఓఎల్ఎక్స్, క్వికర్ వెబ్ సైట్లలో మాదిరిగా మీరూ మీ వస్తువులను ఎంచక్కా అమ్ముకోవచ్చు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు 'సెల్ యాజ్ ఇండివిడ్యువల్' పేరుతో ఒక అద్భుతమైన సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు ఇతర ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్లు అయిన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ కూడా చేయని ప్రయోగమిది. నిజానికి ఈ తరహా ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ల ద్వారా వినియోగదారులు ఇప్పటి వరకు ఆయా వస్తువులు కొనుగోలు మాత్రమే చేసేవారు.

అయితే సాధారణ వినియోగదారులు ఎవరైనా ఏదైనా వాడిన వస్తువు అమ్మాలంటే మాత్రం ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి ప్రత్యేక వెబ్ సైట్లను ఆశ్రయించాల్సిందే. కానీ ఇప్పుడు అమెజాన్ తీసుకొచ్చిన ఈ సదుపాయంతో మీరు వస్తువులు కొనడమే కాదు, ఓఎల్ఎక్స్, క్వికర్ వెబ్ సైట్లలో మాదిరిగా కొత్త వాటితోపాటు మీరు వాడేసిన వస్తువులను సైతం ఎంచక్కా అమ్ముకోవచ్చు.

మీరు ఏ వస్తువును అమ్మకానికి పెట్టదలచుకున్నారో దానికి సంబంధించిన వివరాలు, ధర తొలుత అమెజాన్ వెబ్ సైట్ లో నమోదు చేయాలి. ఎవరైనా మీ వస్తువును చూసి ఆర్డర్ చేస్తే.. అమెజాన్ సిబ్బంది మీ వద్దకు వచ్చి, ఆ వస్తువును ప్యాక్ చేసి, ఆర్డర్ చేసిన వారి చిరునామాలో అందజేస్తారు.

Amazon's Amazing Offer : Not Only Purchasing, You Too Can Sell Used Goods

ఈ సదుపాయం కల్పించినందుకు అమెజాన్ మీ వస్తువు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత కమీషన్ కింద తీసుకుని మిగిలిన డబ్బు మీకు అందజేస్తుంది. ఉదాహరణకు మీ వస్తువు ధర రూ.1000 లోపు ఉంటే కమీషన్ కింద రూ.10, రూ.1000-రూ.5000 మధ్యలో ఉంటే రూ.50, ఒకవేళ మీ వస్తువు ధర రూ.5000కు పైన ఉంటే రూ.100 కమీషన్ కింద తీసుకుంటుంది.

అయితే అమెజాన్ కల్పిస్తున్న ఈ వస్తువులు అమ్మే సదుపాయం ప్రస్తుతం బెంగళూరు వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ సదుపాయం దేశంలోని అన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

English summary
Amazon India has launched a new service called ‘Sell as Individual’ that lets you sell new and used products on the e-commerce website. It is easy to get started with, includes doorstep pickup, packing and delivery of products. Whether you are a small home entrepreneur or an individual trying to sell your products online, Amazon India has just made things simpler. However, the service is currently only available for users in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X