వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీకి బెదిరింపు కేసు: నన్ను బలి పశువును చేస్తున్నారు .. ఎన్ఐఏ కోర్టులో సచిన్ వాజే

|
Google Oneindia TeluguNews

ముఖేష్ అంబానీ బాంబు బెదిరింపు కేసులో అరెస్టయిన సస్పెండ్ పోలీసు అధికారి సచిన్ వాజే కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఇంట్లో భారీగా మందుగుండు సామగ్రిని ఉందని, ఈ కేసులో మరింత లోతుగా సచిన్ వాజే ను ప్రశ్నించాలని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈరోజుతో సచిన్ వాజే రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో మరోమారు దర్యాప్తుకు అనుమతించాలని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

విశాఖ ఉక్కుపై ప్రధాని మోడీకి లేఖలు రాసిన చంద్రబాబు .. వైసీపీకి షాక్ ఇచ్చారుగా !!విశాఖ ఉక్కుపై ప్రధాని మోడీకి లేఖలు రాసిన చంద్రబాబు .. వైసీపీకి షాక్ ఇచ్చారుగా !!

తనను బలిపశువును చేస్తున్నారని సచిన్ వాజే ఆసక్తికర వ్యాఖ్యలు

తనను బలిపశువును చేస్తున్నారని సచిన్ వాజే ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారని సచిన్ వాజే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
సచిన్ వాజే ఇంటి నుండి అరవై రెండు బుల్లెట్లు లభించాయని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అతని సర్వీస్ రివాల్వర్ కోసం ఇచ్చిన 30 బుల్లెట్లలో 5 మాత్రమే కనుగొనబడ్డాయి. మిగిలినవి ఏమయ్యాయో నిందితుడు చెప్పడం లేదని ఎన్ఐఏ తెలిపింది. పేలుడు పదార్థాలు దొరికిన ఎస్‌యూవీని కలిగి ఉన్న మన్సుఖ్ హిరెన్‌తో సంబంధాలున్నందుకు సచిన్ వాజే‌ను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 17 న ఇద్దరూ కలుసుకున్నట్లు తమకు ఆధారాలు దొరికాయని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

మన్సుఖ్ హిరెన్ హత్యకు సచిన్ వాజేకు సంబంధం

మన్సుఖ్ హిరెన్ హత్యకు సచిన్ వాజేకు సంబంధం

మన్సుఖ్ హిరెన్ మరణానికి వాజే ప్రమేయం ఉందని దర్యాప్తు చేస్తున్న యాంటీ టెర్రర్ స్క్వాడ్ అనుమానిస్తున్నారు. 45 ఏళ్ల మన్సుఖ్ హిరెన్ మార్చి 5 న ముంబైకి సమీపంలో ఒక క్రీక్ సమీపంలో చనిపోయాడు. అతని మరణం హత్యగా భావిస్తూ దర్యాప్తు చేశారు. ఇక ఈ కేసు కూడా ఎన్ఐఏ కు బదిలీ చేశారు . నిందితుల రక్త నమూనాలను తీసుకున్నామని , స్వాధీనం చేసుకున్న ఐదు వాహనాల నమూనాలను కూడా డిఎన్ఎ మ్యాచింగ్ కోసం సేకరించామని ఎన్ఐఏ ఈ రోజు కోర్టుకు తెలిపింది.

తనను మళ్ళీ పోలీస్ కస్టడీకి పంపవద్దని కోర్టును కోరిన సచిన్ వాజే

తనను మళ్ళీ పోలీస్ కస్టడీకి పంపవద్దని కోర్టును కోరిన సచిన్ వాజే

సచిన్ వాజే సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.అప్పటి మన్సుఖ్ హిరెన్ హత్య కేసులో అరెస్టయిన వారిని విచారించాలని వాజే కోరుకున్నట్టు తెలుస్తుంది .
తాను ఇప్పటివరకు దర్యాప్తులో సహకరించానని , నన్ను మళ్ళీ పోలీసు కస్టడీకి పంపవద్దు అని సచిన్ వాజే కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎను చేర్చడం గురించి ఎన్‌ఐఏ కోర్టును సంతృప్తి పరచాలని సచిన్ వాజే న్యాయవాది వాదించారు. కారు నుండి జెలటిన్ మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు ఎత్తి చూపిన సీనియర్ న్యాయవాది, సాక్ష్యం సరిపోదని ఆయన అన్నారు. మొత్తానికి కోర్టులో తనను బలిపశువును చేస్తున్నారని సచిన్ వాజే చెప్పటం ఆసక్తికరంగా మారింది.

English summary
Suspended police officer Sachin Waze, made inetresting comments that he is being made scapegoat in this case . The NIA officials arrested in the Mukesh Ambani explosives scare case, had a considerable amount unexplained of ammunition in his house and should be questioned further, the National Investigation Agency said today. Sachin Waze's remand with the agency -- which is investigating the whole issue -- ends today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X