వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎథ్నిక్ వేర్, చీరల వ్యాపారంలో అంబానీ ; త్వరలో బెంగళూరులో, దేశ వ్యాప్తంగానూ రిలయన్స్ రిటైల్ ప్రత్యేక స్టోర్లు

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు వస్త్ర వ్యాపారంపై ప్రముఖ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే ఎథ్నిక్ వేర్, చీరల వ్యాపారంపై పారిశ్రామిక దిగ్గజాల దృష్టి పడింది అంటే మహిళా లోకం కోసం సాగిస్తున్న వస్త్ర వ్యాపారం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆసియాలో అపరకుభేరుడు ముఖేష్ అంబానీ చీరల వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్టు వస్తున్న వార్తలు అందుకు ఊతమిస్తున్నాయి. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ రిటైల్ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో మహిళా లోకం కోసం శారీస్ స్టోర్స్ ను ప్రారంభించనున్నట్టు సమాచారం.

Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)

చీరల వ్యాపారంలోకి రిలయన్స్ రిటైల్

చీరల వ్యాపారంలోకి రిలయన్స్ రిటైల్

రిలయన్స్ రిటైల్ ఎథ్నిక్ వేర్ , చీరల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఇప్పుడు చీరల వ్యాపారాన్ని ప్రారంభించబోతుందని తెలుస్తుంది. రిలయన్స్ రిటైల్ ఇప్పుడు అవంత్రా బ్రాండ్ పేరుతో చైన్ సిస్టంలో షాపులను ప్రారంభిస్తోంది. పండుగలు, వివాహ సీజన్‌కు ముందురిలయన్స్ రిటైల్ చేసిన ఈ ప్రకటన షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. తనిష్క్ కూడా ఎత్నిక్ వేర్ రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తుండగా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ తరుణ్ తహిలియాని మరియు సబ్యసాచి వంటి డిజైనర్ వేర్ లేబుల్‌లలో తన వాటాలను పెంచింది.

అవంత్రా బ్రాండ్ నేమ్ తో ప్రత్యేక స్టోర్ లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్

అవంత్రా బ్రాండ్ నేమ్ తో ప్రత్యేక స్టోర్ లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్

చీరలు భారతీయ సంప్రదాయ దుస్తుల విషయం కోసం అవంత్రా బ్రాండ్ నేమ్ తో ప్రత్యేక స్టోర్ లను ఏర్పాటు చేయనుంది రిలయన్స్ రిటైల్. అవంత్రాలో ధరలు మధ్య-పరిమాణంలో మరియు మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేణిలో ఉంటాయి. పండుగల సీజన్ లోనే గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ రిటైల్ ఇప్పుడు బెంగళూరులో మొదటి అవంత్రా స్టోర్ ను ఈ పండుగ సీజన్లో ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట బెంగళూరులో తొలి స్టోర్ ని ఏర్పాటు చేసి ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రిలయన్స్ రిటైల్ ద్వారా శారీస్ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నారు.

ఆభరణాలు, ఎథ్నిక్ వేర్, చీరలు మాత్రమే కాదు టైలరింగ్ సేవలు కూడా

ఆభరణాలు, ఎథ్నిక్ వేర్, చీరలు మాత్రమే కాదు టైలరింగ్ సేవలు కూడా

ప్రైవేట్ లేబుల్‌లను విక్రయించడమే కాకుండా, అవంత్రా ప్రాంతీయ నేత క్లస్టర్‌లు మరియు నల్లి సిల్క్స్ మరియు పోతిస్ వంటి అనేక థర్డ్ పార్టీ బ్రాండ్‌లతో జతకడుతుంది అని సమాచారం. రాబోయే రిలయన్స్ రిటైల్ ఆభరణాలు, టైలరింగ్ సేవలు, ఎథ్నిక్ వేర్ మరియు చీరలతో పాటు యాక్సెసరీలను కూడా అందిస్తుంది. ఆభరణాలు, ఉపకరణాలు మరియు టైలరింగ్ సేవలు కూడా రిలయన్స్ రిటైల్ లో ఇకముందు భాగంగా ఉంటాయి" అని వార్తలు వస్తున్నాయి.

సాంప్రదాయ దుస్తులకు భారీ డిమాండ్ .. అందుకే ఎథ్నిక్ వేర్ పై చాలా సంస్థల దృష్టి

సాంప్రదాయ దుస్తులకు భారీ డిమాండ్ .. అందుకే ఎథ్నిక్ వేర్ పై చాలా సంస్థల దృష్టి

గ్లోబల్ బ్రాండ్‌లు కూడా భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే సాంప్రదాయ దుస్తులకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగంలో చాలా బ్రాండ్‌లు తమ స్వంత సేకరణలను ప్రారంభించడానికి ప్రయత్నాలను మొదలు పెట్టాయి. దీంతో మహిళల సాంప్రదాయం దుస్తుల మార్కెట్ వార్షికంగా 10 శాతం పెరుగుతుందని అంచనా. ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ మరియు రిలయన్స్ గ్రూప్ కింద ఉన్న అన్ని రిటైల్ కంపెనీల హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, 2021 ఆర్థిక సంవత్సరంలో లో రూ .1,57,629 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవర్ నివేదించడం తోపాటు, రూ .5,481 కోట్ల నికర లాభాన్ని నివేదించింది.

English summary
Reliance Retail Ethnic Wear is all set to enter the sarees business. It is learned that Reliance Retail, a subsidiary of Reliance Industries, is all set to launch sarees business now. Reliance Retail is now opening shops in the chain system under the Avantra brand name. The announcement, made by Reliance Retail ahead of the festive and wedding season, is good news for shopping lovers. The good news is that Reliance Retail is all set to open its first Avantra store in Bangalore this festive season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X