పాక్‌కు మద్దతుగా టీమిండియా క్రికెటర్ పోస్ట్..? కొంపదీసి పాకిస్థాన్ వాడివా ఏంటీ..!
భారతదేశం , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. "కంటికి కన్ను తీస్తే ప్రపంచమంతా గుడ్డిదవుతుంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక మంది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.
భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు వేడెక్కిన తరుణంలో, శాంతిని కోరుతూ రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. కొందరు ఆయన దేశభక్తిని సైతం ప్రశ్నించారు.

అయితే, విమర్శలు వెల్లువెత్తడంతో రాయుడు తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అది పిరికితనం కాదని, వివేకం యొక్క గుర్తు అని పేర్కొన్నారు. న్యాయం స్థిరంగా ఉండాలని, అయితే మానవత్వాన్ని విస్మరించకూడదని ఆయన అన్నారు. దేశాన్ని ప్రేమించడంతో పాటు, హృదయంలో దయ కూడా ఉండగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ రాయుడు మరో ట్వీట్ చేశారు. దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలను కొనియాడారు. వారి ధైర్యం వల్లే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని ఆయన అన్నారు.
An eye for an eye makes the world blind..🙏🙏🙏
— ATR (@RayuduAmbati) May 8, 2025
రాయుడు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు మాత్రం రాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అంబటి రాయుడు చేసిన ట్వీట్ డిలీట్ చేయమని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు నువ్వు కొంపదీసి పాకిస్థాన్ వాడివా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అంబటి రాయుడు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications