కాంట్రాక్టర్ల సంఘం నాయకుడు గుండెపోటుతో మరణించాడు, మొన్న ఐటీ దాడుల్లో రూ. 44 కోట్లు సీజ్ !

బెంగళూరు: బీబీఎంపీ కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా, కర్ణాటక రాష్ట్రం కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అంబికాపతి ఈరోజు సాయంత్రం బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కాంట్రాక్టర్ అంబికాపతి సోమవారం గుండెపోటుతో మరణించారని ఆయన సన్నిహితులు తెలిపారని కన్నడ మీడియా తెలిపింది.

గత నెలలో బెంగళూరులోని కాంట్రాక్టర్ అంబికాపతి నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఆ సందర్బంలో అంబికాపతి కుటుంబ సభ్యులకు చెందిన ఇంట్లో రూ. 44 కోట్లు దొరికాయి. ఈ సంఘటన తర్వాత కాంట్రాక్టర్ అంబికాపతి అనారోగ్యానికి గురైనారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. నవంబర్ 27వ తేదీ సోమవారం అంబికాపతి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

Ambikapathy, vice-president of BBMP Contractors Association, died of a heart attack in Bengaluru,

అంబికాపతి ఇంట్లో భారీగా డబ్బు దొరకడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. బీబీఎంపీ కాంట్రాక్టర్ అంబికాపతి ఈరోజు గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అంబికాపతి మృత దేహాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తారని, మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.

బీబీఎంపీ కాంట్రాక్టర్ అంబికాపతి భార్య అంజనమ్మ బెంగళూరు మాజీ కార్పోరేటర్ (బీబీఎంపీ మాజీ కార్పోరేటర్). అంబికాపతికి ఆయన భార్య అంజనమ్మ, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బీబీఎంపీ కాంట్రాక్టర్ అంబికాపతి గుండెపోటుతో మరణించారని తెలుసుకున్న సాటి కాంట్రాక్టర్లు, వివిద పార్టీలకు చెందిన నాయకులకు, బంధులు, స్నేహితులు బెంగళూరులోని సుల్తాన్ పాళ్యలోని గణేశ లేఔట్ లోని ఆయన ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ధౌర్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+