బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మృతదేహాన్ని తరలించేందుకు రూ.60వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడం, సరైన వైద్య వనరులు లేకపోవడం, రోగుల అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలు ఒకవైపు వేధిస్తుంటే కరోనా బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించడం దగ్గర నుండి ఒకవేళ వారు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకువెళ్లడం వరకు అడుగడుగునా కొనసాగుతున్న ఆర్ధిక దోపిడీ ఇంకోవైపు ప్రజలను ఇబ్బంది పెడుతుంది.

కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో లింక్ , కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన మంత్రి కేటీఆర్ !!కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో లింక్ , కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన మంత్రి కేటీఆర్ !!

 కరోనా మృతుని డెడ్ బాడీ తరలించటానికి 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

కరోనా మృతుని డెడ్ బాడీ తరలించటానికి 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న తమ వారి కోసం సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన ఒక మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ 60 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ యాభై ఐదు ఏళ్ళ వ్యక్తి మృతి చెందిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో మృతుని కుమార్తె తన బంగారు గొలుసును అమ్మడానికి సిద్ధమైంది. ఈ విషయం తెలిసిన పోలీసులు జోక్యం చేసుకుని మృతుని అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా పాజిటివ్ అని తెలిసినా ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేక బాధితుడి అగచాట్లు

కరోనా పాజిటివ్ అని తెలిసినా ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేక బాధితుడి అగచాట్లు

వివరాల్లోకి వెళ్తే మాతికెరె నివాసి అయిన రిటైర్డ్ ఉద్యోగి ఆర్ వి ప్రసాద్ అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకో గా, ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయనను ఆసుపత్రిలో చేర్పించడం కోసం మేనల్లుడు అమిత్ దాదాపు అన్ని ఆసుపత్రులను ఎంక్వయిరీ చేశారు. చాలా ఆస్పత్రులలో బెడ్స్ ఖాళీ లేకపోవటంతో అతనిని ఆసుపత్రిలో చేర్పించడం కోసం బీబీఎంపీ హెల్ప్ లైన్ ను సంప్రదించాడు . హెల్ప్ లైన్ కూడా బెడ్ కోసం వేచి ఉండాలని సూచించడంతో , ఆస్పత్రిలో చేర్చడానికి నానా యాతన పడ్డారు.

 పరిస్థితి విషమించటంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే యత్నం .. రోగి మృతి

పరిస్థితి విషమించటంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే యత్నం .. రోగి మృతి

చివరగా ప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడుకుని ఆస్పత్రిలో చేర్పించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ప్రసాద్ మరణించాడు. దీంతో తిరిగి అతని మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ ని కోరగా 60 వేల రూపాయలు డిమాండ్ చేశాడు . కరోనా పరిస్థితులలో ప్రస్తుతం ప్రజలకు ఉన్న అవసరం కొంతమందికి అవకాశం గా మారుతుంది . కనీసం మానవత్వం లేకుండా అందినకాడికి దోచుకుంటున్న వ్యవస్థ అన్ని చోట్ల కనిపిస్తుంది.

 మృత దేహం అంత్యక్రియలకు 60 వేలు డిమాండ్ , జోక్యం చేసుకున్న పోలీసులు

మృత దేహం అంత్యక్రియలకు 60 వేలు డిమాండ్ , జోక్యం చేసుకున్న పోలీసులు

అంబులెన్స్ డ్రైవర్ మృత దేహం తరలించటానికి 60 వేలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిన పోలీసులు జోక్యం చేసుకోవడంతో అంబులెన్స్ డ్రైవర్ తాను 60 వేల రూపాయలు చెల్లించాలని అడగలేదని బుకాయించాడు . కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే అడిగానని, మృతుల కుటుంబం దానిని 60 వేల రూపాయలుగా భావించింది అని అంబులెన్స్ డ్రైవర్ చెప్పడం గమనార్హం.

అయితే పోలీసులు జోక్యం చేసుకోవటంతో ఎలాంటి దోపిడీ లేకుండా మృతుని అంత్యక్రియలు జరిగాయి .

English summary
Recently, an ambulance driver demanded Rs 60,000 to transport the dead body of a corona patient for burial. An ambulance driver demanded Rs 60 thousand to conduct a funeral after the death of a fifty-five-year-old man who was infected with corona. With this the deceased's daughter prepared to sell her gold chain. Knowing this, the police intervened and conducted the funeral of the deceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X