భారత్‌లో యూఎస్ ఎంబసీ రికార్డ్: పది లక్షలు దాటిన వీసాలు, ఇంకా ముగిసి పోలేదు
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతూనే ఉంది. తాజాగా, ఆ సంఖ్య రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుత సంవత్సరంలో అన్ని రకాల వీసాలు కలిపి మిలియన్ (పది లక్షలు) వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
Missionto1M పూర్తయ్యింది. భారత్‌లో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న మిలియన్ వీసాల జారీ లక్ష్యాన్ని దాటేశాం. అయితే, ఇక్కడితో మేం ఆగిపోం. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తాం. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తాం అని అమెరికా రాయబార కార్యాలయం తమ పోస్టులో పేర్కొంది. దీనికి ఓ వీడియోను కూడా జత చేసింది.

ఈ సందర్భంగా భారత్‌కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆ వీడియోలో మాట్లాడుతూ.. ఈ రికార్డు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మా ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బంధం మాది. మా రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ఈ బంధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాబోయే రోజుల్లో మరింత మంది భారీయులకు రికార్డు స్థాయిలో వీసాలు అందజేస్తామని వివరించారు.
#Missionto1M accomplished! We are excited to announce that the U.S. Mission to India has reached and surpassed our goal to process one million visa applications in 2023!
— U.S. Embassy India (@USAndIndia) September 28, 2023
We will not stop here and continue our progress in coming months, to give as many Indian applicants the… pic.twitter.com/4mTypC2wqh
కాగా, 2022 ఏడాది మొత్తంలో జారీ చేసిన వీసాలను మించి.. ఈ ఏడాది ఇప్పటికే వీసాలు జారీ అయ్యాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అయితే, 2019తో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ అని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా ప్రపంచ వ్యాప్తంగా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే దక్కడం గమనార్హం. విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్.ఎల్ కేటగిరి ఉద్యోగ వీసాల్లో 65 శాతం భారతీయులకు జారీ అయ్యాయి. ప్రపంచంలో భారతీయులు ఎక్కువగా నివసించేది అమెరికానే కావడం గమనార్హం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications