చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్
ఒక వైపు చర్చల్లో పాల్గొంటూనే.. మరోవైపు వరుస ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భరాత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లోని వివిధ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిన డ్రాగన్ బలగాలు.. తాజాగా చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల్ని చెరిపేసేందుకు విఫలయత్నం చేశాయి. ఈ ఉదంతంపై వివాదం కొనసాగుతుండగానే.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస మానసరోవరం దగ్గరా డ్రాగన్ సైనిక చర్యల్ని ముమ్మరం చేసినట్లు రిపోర్టులు వచ్చాయి.
Recommended Video
కైలాస శిఖరం, సరోవర సరస్సును కలిపి కైలాస మానసరోవరంగా పిలుచుకోవడం తెలిసిందే. సైనిక పరంగానూ కీలక మైన ఆ ప్రాంతంలో చైనా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు గతంలోనే వెల్లడైంది. అయితే, అక్కడ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మాత్రం తాజాగా బయటపడింది. హిందువుల పవిత్ర స్థలాలకు సమీపంగా చైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నది.

సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో, సుమారు 80 కి.మీ. పొడవున చైనా సైనిక నిర్మాణాలు, వాహనాలు, బలగాల మోహరింపునకు సంబంధించిన దృశ్యాలు శాలిలైట్ల ద్వారా వెలుగులోకి వచ్చాయి. భూతలంపైనుంచి ఆకాశంలో గల టార్గెట్లను ఛేదించగల మిసైళ్లను కూడా చైనా మోహరించింది. ఇప్పటికే తూర్పు లదాక్ అంతటా ఉద్రిక్తతలు నెలకొన్నవేళ తాజాపరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నది.

తూర్పు లదాక్ లో తాజా పరిస్థితిపై హోం, రక్షణ శాఖలు నిరంతరాయంగా ప్రధాని నరేంద్ర మోదీకి బ్రీఫింగ్ ఇస్తున్నాయి. ఈనెల 29-30 అర్ధరాత్రి జరిగిన సంఘటనల్లో హింస చోటుచేసుకోలేదని, సరిహద్దులు చెరిపేసేందుకు చైనా ప్రయత్నించగా, భారత్ అడ్డుకుందని ఆర్మీ వెల్లడించింది. అయితే, ఇది వట్టి ఆరోపణే అని, చైనీస్ ఆర్మీ ఎల్ఏసీని దాటలేదని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications