లంచానికి విసిగిపోయి పంటకు నిప్పు పెట్టుకున్న రైతు
లక్నో: కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నాశం కావడం, నష్టపరిహారం ఇప్పించండని అడిగితే అధికారులు రాబందుల లాగ లంచం లంచం అంటు పీడించడంతో అన్నదాతకు కోపం వచ్చింది. వెంటనే పొలం దగ్గరకు వెళ్లి మిగిలిన పంటకు నిప్పంటించాడు.
ఉత్తరప్రదేశ్ లోని మురదాబాద్ జిల్లా అహ్లాద్ పూర్ గ్రామంలో అమీర్ హుస్సేన్ (54) అనే అన్నదాత నివాసం ఉంటున్నారు. ఈయన తన పోలంలో గోధమ పంట వేశారు. పంట ఏపుగా చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. వేసిన పంటలో 70 శాతం వరకు నేలపాలైయ్యింది.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసింది. విషయం తెలుసుకున్న అమీర్ హుస్సేన్ అధికారుల దగ్గరకు వెళ్లారు. తరువాత తాను వేసిన పంట మొత్తం నేలపాలైయ్యిందని చెప్పి నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు.
అధికారులు కిందిస్థాయి సిబ్బందిని పంపించి ఎంత నష్టం జరిగిందో తెలుసుకుని రావాలని సూచించారు. పొలం దగ్గరకు వచ్చిన ప్రతి ఉద్యోగి తమకు లంచం ఇస్తే ఇంత నష్టం జరిగిందని పై అధికారులకు నివేదిక ఇస్తామని చెప్పడం మొదలు పెట్టారు.
లంచం ఇవ్వలేక విసిగిపోయిన అమీర్ హుస్సేన్ మిగిలిన పంటకు కిరోసిన్ చల్లి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న మీడియా సభ్యులు అమీర్ పోలం దగ్గరకు వెళ్లారు. పంటలు వేసి నష్టపోయిన తమలాంటి రైతులను ఆదుకొవడానికి కాకుంటే ఇంకెందుకు ఈ ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసింది అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications