మోడీ సన్నిహితుడు షాకు జెడ్ ప్లస్, నిలదీసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిన ప్రముఖుల పేర్లతో జాబితా రూపొందించింది. ఈ జాబితాలో అమిత్ షా పేరు కూడా చేర్చారు.

అమిత్ షా ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా సీట్లు దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జడ్ ప్లస్ భద్రత కల్పించాలన్న నిర్ణయం తీసుకుంది. దేశంలో జడ్ ప్లస్ భద్రతను 250 మంది వరకు ప్రముఖులకు అందిస్తున్నారు.
నిలదీసిన కాంగ్రెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కేటాయించడంపై కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆయనకు ఎందుకు ఆ భద్రత కల్పిస్తున్నారో చెప్పాలంది. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారో దేశానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications