వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చీఫ్ ఎవరు ? మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ .. రేపు బీజేపీ ఆఫీస్ బేరర్ల భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మంజి జోష్ మీదున్న బీజేపీకి కొత్త సారథి ఎవరు ? ఏ నేతపై పార్టీ మొగ్గుచూపుతుంది ? ఆరెస్సెస్ ఆశీర్వాదం ఏ నేతను వరించనుంది ? ఇంతకీ కొత్త బీజేపీ చీఫ్ ఎవరో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. రేపు ఢిల్లీలో ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహిస్తున్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ఈ భేటీలో అందరి అభిప్రాయం తీసుకొని .. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.

షా .. వారసుడెవరు ?
ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో అమిత్ షా చేరారు. దీంతో బీజేపీ పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధ్యక్షులతో అమిత్ షా మాట్లాడారు. తాను హోంమంత్రి పదవీ నిర్వహిస్తున్నందున బీజేపీ అధ్యక్షుడి పదవీ కోసం నేతను ఎంపికచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం గురువారం బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సమాచారం ఇచ్చినందున .. అన్నిరాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత సభ్యులు, రాష్ట్రాల ఇంచార్జీలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయం తీసుకొని .. ఏకాభిప్రాయంతో బీజేపీ కొత్త బాస్‌ను ఎంపికచేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.

Amit Shah calls meet of BJP office bearers to elect new party chief

యూపీ, బీహర్ చీఫ్‌లు కూడా ..
బీజేపీ జాతీయ అధ్యక్షుడితోపాటు యూపీ, బీహర్ అధ్యక్షులను కూడా ఎన్నుకుంటారని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. తర్వాత బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతామని బీజేపీ వర్గాలు సంకేతాలిచ్చింది. ఇందుకోసం ఇప్పటికే ఈ నెల 18న ప్రధాన కార్యదర్శులతో సమావేవం నిర్వహిస్తామని అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో అమిత్ షా సమావేశమై .. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయం గురించి చర్చించారు.
English summary
bharatiya Janata Party chief Amit Shah has called for a meet of the party's national office bearers tomorrow in Delhi. All BJP state presidents, organisation mantris and state in-charges have been called for the meeting. The objective of the meeting is believed to be the election of new post holders within the BJP. The meeting will be held to start the process of organisational elections which are due soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X