బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి: తేల్చి చెప్పిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, లింక్!
మైసూరు: బెళగావి జిల్లాలో ఇప్పటికే పరోక్షంగా బీజేపీ గెలుపుకోసం పని చేస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ బీజేపీలో చేరుతున్నారా ? లేదా ? అనే విషయంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
మైసూరులో శనివారం విలేకరులు గాలి జానర్దన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా అని అమిత్ షాను ప్రశ్నించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన పార్టీలో చేరుతున్నారని తనకు ఎలాంటి సమాచారం లేదని అమిత్ షా అన్నారు.

గాలి జనార్దన్ రెడ్డి పరోక్షంగా కూడా బీజేపీకి ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి విషయంలో క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది.












Click it and Unblock the Notifications