2026 ఎన్నికల్లో తమిళనాడులో చరిత్ర సృష్టిస్తాం : అమిత్ షా
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్ లోనూ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశ రాజధాని దిల్లీలో విజయం సాధించామని వచ్చే ఏడాది తమిళనాడు టార్గెట్ అని అన్నారు. జూన్ 8న అమిత్ షా తమిళనాడులోని మధురైలో పర్యటించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నేతలతో ఏర్పాటు చేసిన 'కార్యకర్త సమ్మేళన్'లో కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ తమను ఓడించలేదని డీఎంకే అధినేత స్టాలిన్ భ్రమలో ఉన్నారని.. ఆయన్ను ప్రజలే ఇంటికి పంపుతారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ- ఏఐడీఎంకే కూటమి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ ఏడాది దిల్లీలో విజయం సాధించామని అలాగే వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్ లో కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'కార్యకర్త సమ్మేళన్'కు ముందు తమిళనాడులోని బీజేపీ నేతలతో అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. అంతేకాక మధురైలోని మీనాక్షి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధురైలో నిర్వహించిన కార్యకర్త సమ్మేళన్ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపునిచ్చారు.
#WATCH | Madurai, Tamil Nadu | Union Home Minister Amit Shah says, "In 2025, we formed the government in Delhi, in 2026, the BJP-NDA will form the government in West Bengal and Tamil Nadu..." pic.twitter.com/P1WQUd7Mh3
— ANI (@ANI) June 8, 2025
గత ఎన్నికల సమయంలో స్టాలిన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారో చెప్పాలని సీఎం స్టాలిన్ పై ప్రశ్నలు సంధించారు. గత పదేళ్లలో తమిళనాడుకు.. మేదీ ప్రభుత్వం రూ.6.80 లక్షల కోట్లు ఇచ్చిందనీ.. అయినా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని సీఎం స్టాలిన్ అడుగుతున్నారని మండిపడ్డారు.ఈ మేరకు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications