"పార్లమెంటులో అమిత్ షా చేతులు వణికిపోయాయి": రాహుల్ సంచలనం!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగి 'ఓట్ చోరీ-గద్దీ చోడ్' ర్యాలీలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అసలైన పోరాటం సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల దొంగతనం అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించడంతో పాటు, ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ దాడి
రాంలీలా మైదానంలో జరిగిన భారీ ర్యాలీలో రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అండమాన్-నికోబార్‌లో మోహన్ భగవత్ చేసిన ఒక ప్రకటన గురించి తెలుసుకున్న తర్వాత తాను ప్రసంగాన్ని మార్చుకున్నానని రాహుల్ తెలిపారు. భారతీయ సంస్కృతి, అన్ని ధర్మాల పునాది సత్యంపైనే ఆధారపడి ఉందని, 'సత్యం శివం సుందరం' ప్రకారం సత్యమే గొప్ప విలువ అని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం: అయితే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతం దీనికి విరుద్ధమని.. వారి దృష్టిలో సత్యానికి విలువ లేదని.. అధికారం, శక్తి మాత్రమే అత్యున్నతమని ఆయన ఆరోపించారు.

Amit Shah Hands Were Shaking in Parliament Rahul Gandhi Explosive Allegations

ఓట్ల దొంగతనం అంశాన్ని లేవనెత్తుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. "నేను పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు, చేసిన ప్రజెంటేషన్‌లోని అంశాలకు వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. అందుకే పార్లమెంటులో అమిత్ షా చేతులు వణుకుతున్నాయి" అని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు దేశంలో జరుగుతున్న పోరాటం సత్యం వర్సెస్ అధికారం అని రాహుల్ పేర్కొన్నారు. "వారి వద్ద అధికారం ఉంది, శక్తి ఉంది, కానీ మా వద్ద సత్యం ఉంది. సత్యంతో నిలబడి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వాన్ని తప్పిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు
తన ప్రసంగంలో రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ECI) పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఇకపై స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థగా పనిచేయడం లేదని, ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. కొంతమంది ఎన్నికల కమిషనర్ల పేర్లను ప్రస్తావిస్తూ, సత్యాన్ని అణచివేసే పోరాటంలో ఇదంతా భాగమేనని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్లకు పూర్తి ఇమ్యూనిటీని కల్పించే కొత్త చట్టాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. "ఎన్నికల కమిషనర్లు ఏది చేసినా వారిపై ఎలాంటి చర్య తీసుకోలేరు అనే కొత్త చట్టం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం" అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మారుస్తామని, ఎన్నికల అధికారులను జవాబుదారీగా చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. "మీరు భారతదేశ ఎన్నికల కమిషనర్లు, నరేంద్ర మోదీ ఎన్నికల కమిషనర్లు కాదు" అని ఆయన ఈసీఐ అధికారులకు రాహుల్ గాంధీ నేరుగా సందేశం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+