ఇది మోదీ ఇండియా.. ఒక్కొక్కడినీ లేపేస్తాం: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రఘటన తర్వాత భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని యావత్ భారతావని కసిగా రగిలిపోతోంది. ఇక భారత్- పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధం ఏ క్షణం ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ దాడి చేస్తుందోనని కంటిమీద కునుకు లేకుండా పాకిస్థాన్ భయంతో ఉంది. ప్రస్తుతం పహల్గాం ఉగ్రవాదుల జాడను కనిపెట్టే పనిలో ఎన్ఐఏ నిమగ్నమైంది.

ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో టెర్రరిజంను అంతం చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ఉగ్రవాదులు విజయం సాధించామని అనుకోవద్దని హెచ్చరించారు. ఇది ప్రధాని మోదీ ఇండియా.. ఒక్కొక్కడినీ లేపేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఓ పిరికిపంద చర్య అని.. దీన్ని విజయంగా భావించే ఉగ్రమూకలను ఏరిపారేస్తామన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తామని స్పష్టం చేశారు.

Amit Shah Modi Government Committed to Eradicating Terrorism in India

'దేశంలోని 140 కోట్లమంది భారతీయులు మాత్రమే కాదు. ప్రపంచం మొత్తం భారత్ వెంటే ఉంది. అన్ని దేశాలు ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. టెర్రరిజాన్ని అంతం చేసేంత వరకూ మా పోరాటం ఆగదు' అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

మరోవైపు ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా లభించిన రెండు కీలక వీడియోల ఆధారంగా ఉగ్రదాడిని ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. జిప్‌ లైన్‌ ఆపరేర్లను విచారణ చేస్తున్న ఎన్‌ఐఏ.. బైరసన్‌ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది. ఈ మేరకు విచారణను ముమ్మరం చేసింది. మరోవైపు భారత్ ఈరోజో, రేపూ తమపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోందని సమాచార మంత్రి అతుల్లా తరార్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే భారత్ ఈరోజు రాత్రికి దాయాది దేశంపై సర్జికల్ స్ట్రైక్ మొదలెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మే 02 ప్రధాని మోదీ భారత జాతిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే కఠినమైన చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+