Amit Shah: సత్యపాల్ మాలిక్ ఆరోపణలపై స్పందించిన అమిత్ షా.. నోటీసులు అందుకేనని వెల్లడి..
కేంద్రంపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. పారామిలటరీ సిబ్బందికి తీవ్రవాద దాడి ముప్పు ఉన్నప్పటికీ విమానాలను "తిరస్కరించారు" రోడ్డు మార్గంలో ప్రయాణించేలా చేశారని మాలిక్ ఇటీవల కేంద్రం ఆరోపణలు చేశారు. అయితే పదవిలో ఉన్నప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడలేదని అమిత్ షా ప్రశ్నించారు.
"అధికారంలో ఉన్నప్పుడు ఆత్మ ఎందుకు మేల్కోదు. ఇలాంటి వ్యాఖ్యల విశ్వసనీయత ప్రజలకు, జర్నలిస్టులకు తెలియాలి.. ఇవన్నీ నిజమైతే ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అలాంటిదేమీ చేయలేదని దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను " అని షా శనివారం చెప్పారు. మాలిక్ ఆరోపణలు చేసిన తర్వాత అతనికి సీబీఐ సమన్లు జారీ చేసింది. దీనిపై అమిత్ షా మాట్లాడారు.మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో జరిగిన బీమా కుంభకోణం విచారణలో భాగంగానే సమన్లు జారీ అయ్యాయని పేర్కొన్నారు.

ఈ వ్యవహారానికి.. భాజపా ప్రభుత్వంపై మాలిక్ చేసిన విమర్శలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆయనకు సీబీఐ నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి అని అమిత్ షా గుర్తు చేశారు. "నా సమాచారం ప్రకారం మాలిక్ కు సీబీఐ సమన్లు రావడం ఇది మూడోసారి. దర్యాప్తు జరుగుతోంది. మాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయన్ను పిలిచారనడంలో వాస్తవం లేదు" అని హోంమంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆరోపించిన బీమా కుంభకోణంపై వివరణ ఇచ్చేందుకు సీబీఐ తనను పిలిచిందని మాలిక్ శుక్రవారం తెలిపారు.
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన బీమా కుంభకోణంపై అడిగినప్పుడు ఏప్రిల్ 27 లేదా 28న J-Kలో ఆరోపించిన బీమా స్కామ్‌కు సంబంధించి స్పష్టత ఇవ్వడానికి తమ ఢిల్లీ కార్యాలయానికి రావాలని సీబీఐ నన్ను కోరిందని మాలిక్ తెలిపారు. ఈ వ్యవహారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త ప్రమేయం ఉందని గతంలో ఆయన ఆరోపించారు.మాలిక్ ఆరోపణలపై స్పందిస్తూ, రామ్ మాధవ్ ఏప్రిల్ 13న అతనికి 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపారు.












Click it and Unblock the Notifications