దీవార్ చూసి అమ్మ పిల్లలా ఏడ్చింది: అమితాబ్

బాలీవుడ్‌లో తనకు కష్టకాలం ఎదురైనప్పుడు తన తల్లి ఇచ్చిన మద్దతును, శక్తిని ఆయన గుర్తు చేసుకున్నారు. చలనచిత్ర రంగంలో తాను ఇబ్బందులు ఎదుర్కున్నప్పుడు తన తల్లి తన పక్కన కూర్చుని తన తల వెంట్రుకల్లో వేళ్లు జొనిపి ధైర్యం ఇచ్చేదని చెప్పారు.
తన దీవార్ సినిమాను తన తల్లి చూసిందని, గంటల తరబడి చిన్నపిల్లలా ఏడ్చిందని, తన కుమారుడిని కోల్పోయినట్లుగా విలపించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతి రోజూ తనకు ఆమె శక్తిని ప్రసాదిస్తుందని అన్నాడు. తాను ప్రతి రోజూ ఆమె ముఖం చూస్తానని అన్నాడు.
ప్రముఖ కవి అయిన తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చనిపోయిన రోజును కూడా అమితాబ్ గుర్తు చేసుకున్నారు. తన భర్త పక్కన ఒరిగి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆ తర్వాత ఆమెను తాను మౌనంగా ఆమె గదిలోకి తీసుకుని వెళ్లానని చెప్పారు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని సంతాపం ప్రకటిస్తూ ప్రార్థనలు చేస్తూ మౌనంగా ఉండిపోయిందని అమితాబ్ చెప్పాడు.
తన తల్లి యవ్వనంలో ఉన్నప్పుడు కళాశాలలోని కారిడార్‌లో నడుస్తుంటే యువ విద్యార్థులు ఆమె కోసం చూస్తూ ఏ విధమైన దుస్తులు ధరించిందీ, ఏ సుగంధ ద్రవ్యాలు వాడిందీ ఆలోచిస్తూ ఆసక్తిగా చూసేవారని చెప్పారు.












Click it and Unblock the Notifications