అక్షర, ధనుష్‌లతో అమితాబ్ పతంగుల సందడి
ఆహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఆహ్మదాబాద్‌లో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పతంగి ఎగురవేసి సందడి చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా ఏటా పతంగులు ఎగురవేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన పతంగుల పండుగ కార్యక్రమంలో పాల్గొని గాలి పటాన్ని ఎగుర వేశారు.
బిగ్ రాకతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి అమితాబ్‌తో పాటుగా మరికొందరు బాలీవుడ్ నటులు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన షమితాబ్ సహ నటులు ధనుష్, అక్షర హసన్ కూడా సందడి చేశారు.

అమితాబ్ అందరికీ T 1738 -HAPPY MAKARSANKRANTI అంటూ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్‌లో పతంగులను ఎగురవేయడం కన్నా ఆనందకరమైన విషయం ఏముంటుందని ఆయన న్నారు.
తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అమితాబ్, ధనుష్, అక్షర దేశంలోని వివిధ నగరాల్లో పర్యటిస్తున్నారు. బుధవారంనాడు వారు అహ్మదాబాద్‌లో ఆగారు. ఢిల్లీ, కోల్‌కతాలతో పాటు లండన్‌లో కూడా పర్యటించాలని వారు నిర్ణయించుకున్నారు. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షర సినీ రంగ ప్రవేశం చేస్తోంది. ఆ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదలవుతుంది.












Click it and Unblock the Notifications