లతా మంగేష్కర్ 85లో సచిన్ దంపతులు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: గత ఏడు దశాబ్దాలుగా వేలాది పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన గానకోకిల లతా మంగేష్కర్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెను ఘనంగా సన్మానించాలని భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా లతా మంగేష్కర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
ముంబైలోని షణ్ముఖానంద హాల్ లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి లతా మంగేష్కర్ తరపున ఆమె సోదరి ఉష హాజరయ్యారు. ఈ పుట్టిన రోజు వేడుకులకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ, క్రికెట్ లో భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు లతాజీ పాటలు ఎంతగానో సాయపడ్డాయని తెలిపాడు. "లతా దీదీ నా కెరీర్లో పెద్ద పాత్రే పోషించారు. పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఆమె పాటలు వినడం ప్రారంభించాను. మా అమ్మ జోలపాటలకు బదులుగా లత పాడిన పాటలు ఆలపించేది. ఆటలో విఫలమైనప్పుడు ఆమె పాటలు విని కుదుటపడేవాడిని. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
ఆదివారం ఆమె జన్మదినం సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. లతామంగేష్కర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, మరిన్ని పాటలు పాడాలని సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, డ్రీమగర్ల్ హేమమాలిని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో విద్యాబాలన్, మిఖా సింగ్ తదితరులున్నారు.
బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. 1942లో 13 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించారు. మన్నాడే, రఫీ, కిశోర్ కుమార్, ముఖేశ్ తదితరులతో కలసి ఆమె పాడిన పాటలు ఆల్ టైం గ్రేట్స్‌గా నిలిచిపోయాయి.

లతా మంగేష్కర్ 85వ పుట్టినరోజు ఫంక్షన్లో సచిన్ దంపతులు
గత ఏడు దశాబ్దాలుగా వేలాది పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన గానకోకిల లతా మంగేష్కర్ తన 85వ పుట్టినరోజుని ఆదివారం జరుపుకున్నారు.

లతా మంగేష్కర్ 85వ పుట్టినరోజు ఫంక్షన్లో సచిన్ దంపతులు
ఆదివారం ఆమె జన్మదినం సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. లతామంగేష్కర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, మరిన్ని పాటలు పాడాలని సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, డ్రీమగర్ల్ హేమమాలిని ఆకాంక్షించారు.

లతా మంగేష్కర్ 85వ పుట్టినరోజు ఫంక్షన్లో సచిన్ దంపతులు
లతా మంగేష్కర్ తన 85వ పుట్టినరోజుని ఆదివారం జరుపుకున్నారు. ముంబైలో ఎంతో ఘనంగా జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకులకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు హాజరయ్యారు.

లతా మంగేష్కర్ 85వ పుట్టినరోజు ఫంక్షన్లో సచిన్ దంపతులు
గానకోకిల లతా మంగేష్కర్ తన 85వ పుట్టినరోజుని ఆదివారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి ఉషా మంగేష్కర్‌కు విగ్రహాన్ని బహుకరిస్తున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications