వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

video: 8.30 మినిట్స్, 5 నిమిషాలే అన్న అమిత్ షా.. మంత్రిపై అసహనం

|
Google Oneindia TeluguNews

మైక్ దొరికితే చాలు.. కొందరు నేతలు రెచ్చిపోతుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన మీటింగ్స్‌లలో మాత్రం ఇబ్బందులు తప్పవు.అవును మిగతా నేతలంతా మాట్లాడాల్సి ఉంటుంది.. అందుకే కాస్త ప్రాబ్లమ్. ఇక విషయానికి వస్తే.. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. అందుకు కారణం.. విజ్ ఏకధాటిగా ప్రసంగం చేయడమే. అప్పటికీ అమిత్ షా కల్పించుకొని మరీ చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. మీరు కూడా చూడండి.

లాంగ్ స్పీచ్

లాంగ్ స్పీచ్

హర్యానాలో గల సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను అమిత్ షా ప్రారంభించారు. అనిల్ విజ్ స్వాగత ఉపన్యాసం చేశారు. హర్యానా చరిత్ర, హరిత విప్లవానికి సహకారం, ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి వివరించారు. తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార సెషన్ గురించి కూడా మాట్లాడారు.

5 నిమిషాలే.. 8.30 మినిట్స్

నిజానికి అనిల్ విజ్‌కు కేటాయించిన సమయం 5 నిమిషాలు.. కానీ ఆయన ఎనిమిదిన్నర నిమిషాలు ప్రసంగించారు. అప్పటికే అమిత్ షా నాలుగుసార్లు కల్పించుకున్నారు. కొన్ని సీట్ల దూరంలో ఉన్న అమిత్ షా.. తొందరగా ముగించాలని నోట్ పంపారు. విజ్ పట్టించుకోకుండా ప్రసంగించారు. మైక్ ఆన్ చేసిన అమిత్ షా విజ్‌కు సైగ చేశారు. అయినా ప్రసంగం ఆపలేదు. చివరకు అమిత్ షా కల్పించుకొని అనిల్ జీ మీకు ఇచ్చినా సమయం అయిపోయింది.. దయచేసి ముగించాలని సూచించారు. మరో పాయింట్ చెప్పాలని అనిల్ విజ్ సమయం అడిగారు. తమ రాష్ట్ర విజయాల జాబితాను వివరించడం కొనసాగించారు. దీంతో అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఖట్టర్ 3 నిమిషాల్లో

ఖట్టర్ 3 నిమిషాల్లో

ముగింపు వ్యాఖ్యలు చెప్పడం మొదలు పెట్టడంతో అమిత్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా చెప్పారు. అమిత్ షా అసహనం వ్యక్తం చేయడంతో ఆ తర్వాత హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 3 నిమిషాల్లో ప్రసంగం ముగించడం విశేషం.

English summary
central home minister amith shah angry on haryana home minister anil vij due to long speech at official programme
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X