Air India: వాసన రావడంతో టేకాఫ్ అయిన వెంటనే ల్యాండ్ అయిన విమానం..
కొచ్చి నుంచి షార్జాకు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగి ల్యాండ్ అయింది. ఆగష్టు 2 రాత్రి కొచ్చి ఎయిర్ పోర్టు నుంచి విమానం గాల్లోకి ఎగిరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాలిపోతున్నట్లు వాసన వస్తున్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. దీంతో పైలట్లు ముందుజాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బింది విమానాన్ని క్షుణంగా పరిశీలించారు. ఎలాంటి సమస్య లేదని గుర్తించారు.
ఈ లోపు ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా మరో విమానం ఏర్పాటు చేసింది. 175 మంది ప్రయాణికులను ఆలస్యంగా షార్జాకు తీసుకెళ్లింది. కొద్ది రోజుల క్రితం జూలై 31న తెల్లవారుజామున షార్జా నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. సాంకేతిక సమస్యలతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తమిళనాడులోని తిరుచిరాప్పలి నుంచి ఉదయం 10:45 గంటలకు విమానం బయలుదేరిన తర్వాత విమానాశ్రయ అథారిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

తిరువనంతపురంలో మధ్యాహ్నం సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. కాగా విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. మరో ఘటనలో విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండింగ్ గేర్‌పై టైర్ పేలడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విమానం హార్డ్ ల్యాండింగ్ చేయడంతో ఎడమ ప్రధాన గేర్ టైర్ ఊడిపోయింది. హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

వర్జీనియాలోని రిచ్‌మండ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం రఫ్‌గా ల్యాండింగ్ చేసినప్పుడు ఒక టైర్ పేలిపోయిందని, మరొకటి స్కీడ్ అయింది. దీంతో విమానం అత్యవసర ద్వారం కూడా ప్రయాణికులు బయటకు వచ్చారు. "ఈ మధ్యాహ్నం మా హబ్‌లో ఫ్లైట్ 1437 సురక్షితంగా ల్యాండింగ్ చేయడం ద్వారా మా ఫ్లైట్ సిబ్బంది, హార్ట్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫస్ట్ రెస్పాండర్స్ చేసిన కృషిని మేము అభినందిస్తున్నాము" అని డెల్టా ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications