తమిళనాడుకు తాళం వేస్తే బెంగళూరుకు మిగిలేది బొంగు మాత్రమే, ఆల్ పార్టీ మీటింగ్ లో !
బెంగళూరు: ఉద్యానవన నగరి బెంగళూరుకు తాగు నీటి సరఫరా బాధ్యత తీసుకున్న బెంగళూరు వాటర్ సప్లే బోర్డు కావేరి ఇరిగేషన్ కార్పొరేషన్‌కు లేఖ రాసింది. రాష్ట్రంలో రుతుపవనాలు మార్పుతో కేఆర్‌ఎస్ రిజర్వాయర్ ఎండిపోతున్న తరుణంలో బెంగళూరు నగరానికి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది. ఇలాగే ఉంటే బెంగళూరుకు కావేరీ తాగునీరు తసరఫరా చెయ్యడానికి నానా ఇబ్బందులు ఎదురౌతాయని బీఎండబ్ల్యూస్ ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖరాసింది.
బెంళూరు జలమండలి అధికారులు కావేరి నీరు సరఫరా మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాశారు. బెంగళూరు నగర ప్రజలకు కావేరి తాగు నీరు అందించడానికి ప్రతినెల 1. 6 టీఎంసీల నీరు అవసరం అని, ఆ నీరు మాకు అందించాలని లేఖలో మనవి చేసింది. బెంగళూరుకు కావేరీ నీరు సరఫరా చేసే లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 ల ద్వారా బెంగళూరు నగర ప్రజలకు కావేరీ నీరు అందిస్తున్నారు.

మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణం సమీపంలోని కేఆర్ఎస్ డ్యామ్ నుంచి బెంగళూరు ప్రజలకు నిత్యం కావేరీ నీరు సరఫరా అవుతోంది. కేఆర్ఎస్ డ్యామ్ నుంచి 49. 45 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అయితే ఇప్పుడు కావేరి నీటి నిల్వ 21. 09 టీఎంసీలకు పడిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని కొడుగు భాగంలో సరైన వర్షాలు కురవకపోవడంతో కేఆర్ఎస్ డ్యామ్ లో నీరు నిల్వకాలేదు. కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేస్తోంది. బుధవారం బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో చర్చించిన అన్ని పార్టీల నాయకులు ఓ నిర్ణయానికి వచ్చారు. తమిళాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

సరైన వర్షాలు కురవకపోవడంతో కేఆర్ఎస్ డ్యామ్ ఎండిపోతున్నదని, బెంగళూరు ప్రజలకు తాగునీరు అందించడానికి ఇబ్బందిగా తయారైయ్యిందని, అందుకే తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యకూడదని అఖిలపక్ష సమావేశంలో నాయకులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బెంగళూరు జలమండలి కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాసింది.
అధికారుల లెక్కల ప్రకారం బెంగళూరు జలమండలి కేఆర్ఎస్ డ్యామ్ నుంచి 1, 450 ఎంఎల్ డీ నీరు తీసుకుని బెంగళూరుకు సరఫరా చేస్తోంది. కేఆర్ఎస్ డ్యామ్ కు 700 క్యూసెక్కుల నీరు వస్తేనే బెంగళూరు ఈ నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. జనవరి నెల నుంచి బెంగళూరు నగరానికి ప్రతినెల 2. 42 టీఎంసీల నీరు అవసరం అవుతోంది.

బెంగళూరు నగర ప్రజలకు నీటి సమస్య ఎదురుకాకుండా చూడాలనే ఉద్దేశంతో బెంగళూరు జలమండి అధికారులు కావేరి వాటర్ సప్లే మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖరాశారని తెలిసింది. బెంగళూరు నగరంతో పాటు నగర శివార్లలోని 110 గ్రామాలకు ప్రజలకు కావేరీ నీరు సరఫరా చెయ్యాలనే ఉద్దేశంతోనే కావేరి వాటర్ సప్లే మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాశామని బెంగళూరు జలమండలి అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications