ఐరన్ రాడ్ కాల్చి కోడలి ప్రైవేట్ పార్ట్స్ మీద వాతలు పెట్టిన అత్త !

భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే అదనపు కట్నం కావాలని భర్త, అత్త ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. పంచాయితీ చేసి పుట్టింటిలో ఉన్న మహిళను భర్త ఇంటికి పిలుచుకుని వెళ్లి ఆమెను నగ్నంగా చేసి రూమ్ లో నిర్బంధించారు. ఇనుప రాడ్ గ్యాస్ స్టౌవ్ మీద కాల్చి దానితో కోడలు శరీరం మీద వాతలు పెట్టారు. అంతటితో శాంతించకుండా అత్త ఆమె కోడలి ప్రైవేట్ పార్ట్స్ మీద అదే ఇనుప రాడ్ తో కాల్చడం కలకలం రేపింది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని విదిషాలో నివసిస్తున్న ఓ మహిళకు సుకీ సెవానియా గ్రామంలో నివసిస్తున్న యువకుడితో వివాహమైంది. మహిళ భర్త భోపాల్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన కొంతకాలనికే అదనపు కట్నం డిమాండ్ చేస్తూ భర్త అతని భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. రోజూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి.

 wifes private parts

ఇప్పటికే పలుమార్లు మహిళ తల్లిదండ్రులు, బంధువులు కలిసి భర్త, అతని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఆ గొడవలు ఆగలేదు. రోజూ గొడవలు జరుగుతుండటంతో విసుగు చెందిన మహిళ 15 రోజుల క్రితం భర్త ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తన భార్య కనిపించడం లేదంటూ భర్త ఉలార్ సేవానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భార్య ఆమె పుట్టింటిలో ఉందని పోలీసులకు తెలిసింది.

అత్త కోడలి ఇంటికి వెళ్లి శాంతియుతంగా మాట్లాడారు. ఇకపై భర్తతో గొడవలు రాకూడదనే విధంగా ప్రవర్తిస్తానని అత్త ఆమె కోడలికి హామీ ఇచ్చింది. అత్త మాటలు నమ్మిన మహిళ కూడా అత్త, భర్త తమ్ముడితో కలిసి భర్త ఇంటికి వెళ్లింది. ఇంటికి చేరుకోగానే భర్త, అత్త, మరిది కలిసి మహిళను ఓ రోజంతా గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు.

 wifes private parts

మహిళను వివస్త్రను చేసి, ఇనుప రాడ్‌ కాల్చి మహిళ శరీరం మరియు ఆమె ప్రైవేట్ భాగాలను కాల్చారని తెలిసింది. మహిళ అరుపులు విన్న స్థానికులు గది తెరిచి చూడగా ఆమె నగ్నంగా ఉన్న విషయం గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భర్త, అత్త, ఆమె మరిదిని అరెస్టు చేశారు. వరకట్న వేధింపులు తదితర సెక్షన్ల కింద ముగ్గురి మీద కేసు నమోదు చేమని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+