నీకే సాధ్యం సామీ.. ముగ్గురితో ఒకే కార్లో స్టార్ హీరో! (వీడియో)
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎప్పుడేం చేసినా అది సంచలనంగానే మారుతుంది. సినిమాల విషయమే కాకుండా ఆయన పర్సనల్ వైఫ్, తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం 61 ఏళ్ల అమీర్ ఖాన్ తన మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారు. తన 25 ఏళ్ల నాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆయన జులై 5న పెళ్లి చేసుకోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లికి ముందు అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుకు, కాబోయే కొత్త పెళ్లికూతురు గౌరీకి మధ్య పరిచయం పెంచి వారి మధ్య చక్కని స్నేహ బంధాన్ని కుదిర్చారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వివరీతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోలో అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ లేదా ఒక అవుటింగ్‌కు వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. విశేషమేమిటంటే, ఒకే కారులో అమీర్ ఖాన్ కాబోయే భార్య గౌరీ స్ప్రాట్, ఆయన మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా, అలాగే కుమారుడు ఆజాద్ రావు కలిసి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో అమీర్ ఖాన్ కారు ముందు సీట్లో కూర్చోగా.. వెనుక సీట్లో కిరణ్ రావు, రీనా దత్తా, ఆజాద్ పక్కన గౌరీ స్ప్రాట్ కూర్చుని ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత వైవాహిక బంధం ముగియడంతో పాటు ఇరుపక్షాల మధ్య దూరం పెరగడం సహజం. కానీ అమీర్ ఖాన్ విషయంలో ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఈ వైరల్ వీడియోలో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, ఆయన కాబోయే భార్య గౌరీ స్ప్రాట్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, సంతోషంగా నవ్వుకుంటూ ఉండటం కనిపించింది. కారు దిగే సమయంలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, ఒకరినొకరు గౌరవించుకునే విధానం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అమీర్ ఖాన్ తన కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.
అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకొని, పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికీ, వారి మధ్య స్నేహపూర్వక సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు తన 25 ఏళ్ల నాటి పాత స్నేహితురాలైన గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త బంధానికి కుటుంబ సభ్యులందరి మద్దతును కూడగట్టడంలో అమీర్ ఖాన్ విజయం సాధించారు. దీనివల్లే కుటుంబ సభ్యులంతా కలిసి ఇలా ఒకే కారులో బహిరంగంగా ప్రయాణించగలిగారు.
😂 Only Aamir Khan has the rare talent to take his first wife, second wife, and maybe even a future third wife in the same car ride! 🚗😜
— Indian Observer (@ag_Journalist) June 16, 2026
Talk about maintaining diplomatic relations at the highest level! 😆#AamirKhan #Bollywood #ViralPost #FunnyPost #Meme #BollywoodMemes… pic.twitter.com/pthMxH5Xl5
నెటిజన్లను ఆశ్చర్యపరిచిన అమీర్ ఖాన్ ఫ్యామిలీ
ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు అమీర్ ఖాన్ కుటుంబ తీరుపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. విడాకుల తర్వాత కూడా మాజీ భార్యతో కాబోయే భార్య ఇంత ఆత్మీయంగా మాట్లాడటం సాధారణ విషయం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. "ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు, బాంధవ్యాలను మెయింటైన్ చేయడం కేవలం అమీర్ ఖాన్‌కు మాత్రమే సాధ్యం" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, "భారతదేశంలో ఇలాంటి ఆధునిక కుటుంబం చాలా అరుదుగా కనిపిస్తుంది" అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. అమీర్ ఖాన్ తన జీవితంలో వివిధ వ్యక్తుల మధ్య ఇంతటి సమతుల్యతను ఎలా కాపాడుకుంటున్నారనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.
ఏది ఏమైనప్పటికీ.. వివాదాలకు తావు లేకుండా తన కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో అమీర్ ఖాన్ చూపించిన పరిపక్వత ప్రశంసలందుకుంటోంది. మూడో పెళ్లికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో, కుటుంబమంతా సంతోషంగా కలిసి గడపడం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీసింది. పరస్పర గౌరవం, సానుకూల అవగాహన ఉంటే ఎలాంటి సంక్లిష్టమైన బంధాలనైనా విజయవంతంగా కొనసాగించవచ్చని అమీర్ ఖాన్ కుటుంబం ఈ వీడియో ద్వారా నిరూపించింది. ఈ వ్యవహారంతో అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications